Yashoda Movie Review: నటీనటులు: సమంత ,ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ
దర్శకుడు : హరి , హరీష్
నిర్మాత : శివ లెంక కృష్ణ ప్రసాద్
బ్యానర్లు : శ్రీదేవి మూవీస్
మ్యూజిక్ : మణిశర్మ
డీఓపీ : ఏం సుకుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరులా ఉండే స్టార్ హీరోయిన్ సమంత నటించిన పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం ‘యశోద’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..సమంత కొద్దీ రోజుల నుండి తనకి ఉన్న మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం మనకి తెలిసిందే..అయితే చికిత్స తీసుకుంటూ కూడా ఆమె మధ్యలో సినిమాకి డబ్బింగ్ చెప్పడమే కాకుండా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంది..దీనిని బట్టి ఆమెకి సినిమా అంటే ఎంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు..ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తో అభిమానుల్లో హైప్ ని పెంచిన ఈ సినిమా, ఆ హైప్ ని అందుకుండా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
జీవితం లో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకొంటున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లులుగా మారుస్తూ ఉంటారు..సంతానం లేని ధనవంతుల కోరికలను తీర్చే యంత్రాలుగా పనిచేస్తూ ఉంటారు ఆ సరోగసి తల్లులు..అయితే ఈ ల్యాబ్ ఒక పెద్ద మాఫియా తో డీల్ కుదిరించుకుంటుండు..ఆ మాఫియా చేసే అకృత్యాల వల్ల బలైన ఎంతోమంది యువతులతో ఒకరు యశోద..అసలు సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారం ఏమిటి..? సరోగసి తల్లులుగా మారిన స్త్రీలను ఏమి చేస్తున్నారు..? యశోద ఛేదించిన ఆ భయంకరమైన నిజం ఏమిటి ? అంత పెద్ద మాఫియా సామ్రాజ్యం ని యశోద ఒక్కటే ఎదుర్కొని ఎలా గెలిచింది? అనేది ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తూ ఈ మూవీ స్క్రీన్ ప్లే కొనసాగుతుంది.
విశ్లేషణ :
సినిమా ప్రారంభం కాస్త స్లో గా అనిపించినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని మరల్చకుండా గ్రిప్పింగ్ గా తియ్యడం లో ఈ సినిమా దర్శకులు హరి – హరీష్ సక్సెస్ అయ్యారు..ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశానికి ముందు 20 నిముషాలు సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది..డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ కి సస్పెన్స్ ని జోడించడమే కాకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలను చాలా చక్కగా రాసుకున్నాడు.
సినిమాని చూస్తునంత సేపు ప్రేక్షకులకు ఉత్కంఠ కలగడమే తప్ప బోర్ మాత్రం కొట్టదు..అంత ఆసక్తికరంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే సాగుతుంది..ఇక సమంత ఈ సినిమాలో తన నట విశ్వరూపం ని చూపించించేసింది..ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫైట్ సన్నివేశాలలో ఎలా చెలరేగిపోయిందో..ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతే అద్భుతంగా చేసింది..సరోగసి కి గురవుతున్న ఒక అమాయిక మహిళగా ఆమె నటన అద్భుతం.

ఇక నెగటివ్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన మరో హైలైట్..మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ ఉన్ని ముకుందన్, సంపత్ , రావు రమేష్ మరియు మురళి శర్మ నటనలు సినిమాని మరోలెవెల్ కి తీసుకెళ్లాయి..సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది..ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ రప్పిస్తుంది..చాలా కాలం తర్వాత ఆయన తన విశ్వరూపం చూపించేసాడు.
ప్లస్సులు:
–> సమంత నటన
–> వరలక్ష్మి శరత్ కుమార్ నటన
–> ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే
–> ఇంటర్వెల్ సన్నివేశం
–> బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్లు :
–> స్లో స్క్రీన్ ప్లే
చివరి మాట :
కొత్త తరహా సినిమాలను చూడాలనుకునే వాళ్ళు..థ్రిల్లింగ్ కథలను చూసేందుకు ఆసక్తి చూపే ఆడియన్స్ కి ఈ చిత్రం తెగ నచ్చేస్తుంది..ఇది కచ్చితంగా థియేటర్స్ లో అనుభూతి చెందాల్సిన సినిమా..కాబట్టి ఈ వీకెండ్ హ్యాపీ గా ఈ సినిమాని చూసేయొచ్చు
రేటింగ్ : 3/5