https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Surya : బిగ్ బాస్ లోకి ‘సూర్య’ రీ ఎంట్రీ..వైరల్ అవుతున్న సూర్య  ఇంస్టాగ్రామ్ పోస్ట్

Bigg Boss 6 Telugu Surya : బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి టాస్కులు ఆడడం లో కానీ..ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ సూపర్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న ఆర్జే సూర్య ఎలిమినేట్ అవ్వడం అందరిని ఎంత నిరాశపరిచిందో మన అందరికి తెలిసిందే..ఎంత టాస్కులు ఆడినా..ఎంత ఎంటర్టైన్మెంట్ పంచినా, ఒక చిన్న పొరపాటు చేసిన ఎలిమినేట్ అయిపోతారు అనడానికి ఒక నిదర్శనం సూర్య..హౌస్ లోకి వచ్చినప్పటి నుండి నేను ఫెమినిస్ట్ ని అని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2022 / 09:27 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Surya : బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి టాస్కులు ఆడడం లో కానీ..ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ సూపర్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్న ఆర్జే సూర్య ఎలిమినేట్ అవ్వడం అందరిని ఎంత నిరాశపరిచిందో మన అందరికి తెలిసిందే..ఎంత టాస్కులు ఆడినా..ఎంత ఎంటర్టైన్మెంట్ పంచినా, ఒక చిన్న పొరపాటు చేసిన ఎలిమినేట్ అయిపోతారు అనడానికి ఒక నిదర్శనం సూర్య..హౌస్ లోకి వచ్చినప్పటి నుండి నేను ఫెమినిస్ట్ ని అని చెప్పుకునే సూర్య ఆరోహి హౌస్ లో ఉన్నంత కాలం ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు.

    ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సూర్య ఇనాయ తో క్లోజ్ గా ఉండడం ప్రారంభించాడు..మాటికొస్తే ముద్దులు పెట్టడం..హగ్ చేసుకోవడం వంటివి ప్రేక్షకులకు వేరేలా ప్రాజెక్ట్ అయ్యింది..అందుకే ఆయన ఎలిమినేట్ అయిపోయాడు..గీతూ ఎలిమినేషన్ కూడా బాలాదిత్య బలహీనతతో ఆదుకోవడం వల్లే జరిగింది అని చెప్పాలి..ఇది ఇలా ఉండగా సూర్య ని అభిమానించే వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

    అదేమిటి అంటే సూర్య అతి త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది..ఈరోజు ఆయన పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఈ వార్తలను మరింత బలోపేతం చేస్తుంది..తన ఫోటో ని అప్లోడ్ చేస్తూ ‘ఇప్పటి వరుకు ఒక లెక్క..ఇప్పటి నుండి మరో లెక్క..సూర్య ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు..ఆ పోస్ట్ లో బిగ్ బాస్ టాగ్ కూడా వాడాడు..అంటే సూర్య మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడా..లేదా ఆయన కొత్త సినిమాలో నటించబోతున్నాని చెప్తున్నాడా అనేది ఫాన్స్ ని కన్ఫ్యూజ్ లో పడేసింది.

    కానీ ఆ పోస్ట్ నిండా బిగ్ బాస్ ట్యాగులు ఉండడం తో కచ్చితంగా బిగ్ బాస్ రీ ఎంట్రీ గురించే అని అనుకుంటున్నారు..మరి అది నిజమో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ వరుకు వెయిట్ చెయ్యాల్సిందే..ఒకవేళ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది నిజంగా ఉంటె ఈ వీక్ లోనే ఉండాలి..లేకపోతే ఇక సీజన్ లో లేనట్టే అనుకోవచ్చు..చూడాలిమరి సోషల్ మీడియా లో వెబ్ సైట్లు ఊదరగొడుతున్నట్టు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సూర్య ఎంట్రీ ఇస్తున్నాడా లేదా అనేది.