https://oktelugu.com/

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మార్చిలో వచ్చే బెస్ట్ ఫోన్లు ఇవే..?

దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కంపెనీలు యూజర్లకు మరింత చేరువ కావడం కోసం ప్రతి నెలా కొత్త ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మార్చి నెలలో పలు దిగ్గజ కంపెనీల నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు లాంఛ్ కానున్నాయి. కొత్త ఫోన్ ను కొనాలనుకునే వారు మార్చిలో విడుదల కాబోయే పాపులర్ ఫోన్ల గురించి అవగాహన కలిగే ఉంటే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 28, 2021 / 11:44 AM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కంపెనీలు యూజర్లకు మరింత చేరువ కావడం కోసం ప్రతి నెలా కొత్త ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మార్చి నెలలో పలు దిగ్గజ కంపెనీల నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు లాంఛ్ కానున్నాయి. కొత్త ఫోన్ ను కొనాలనుకునే వారు మార్చిలో విడుదల కాబోయే పాపులర్ ఫోన్ల గురించి అవగాహన కలిగే ఉంటే మంచి, అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

    మార్చి నెల 4వ తేదీన రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లు లాంఛ్ కానున్నాయి. 5జీ కనెక్టివిటీతో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రెడ్ మీ 10 సిరీస్ ఫీచర్లే రియల్ మీ 8 సిరీస్ ఫోన్లలో ఉండనున్నాయని 108 మెగా పిక్సెల్ కెమెరాతోనే ఈ ఫోన్లు కూడా మార్కెట్ లోకి రాబోతున్నాయని తెలుస్తోంది.

    ఒప్పో ఎఫ్ 19 సిరీస్ ఫోన్లు మార్చి నెలలో లాంఛ్ కానుండగా క్వాడ్ కెమెరాస్ తో 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మోటోరాలా కంపెనీ నుంచి మోటో జీ30, మోటో జీ10 ఫోన్లు కూడా మార్చి నెలలోనే విడుదల కానున్నాయి. మోటో జీ30 తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో అందుబాటులోకి రానుందని సమాచారం. మోటో జీ10 5000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీతో 48 మెగా పిక్సెల్ కెమెరాతో రానుందని తెలుస్తోంది.

    ఐకూ నియో 5 ఫోన్ కూడా మార్చి నెలలోనే విడుదల కానుంది. మార్చి 16వ తేదీన ఈ ఫోన్ లాంఛ్ కానుండగా ఈ ఫోన్ ధర 40,000 రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని సమాచారం. ఆసస్ రోగ్ ఫోన్ 5 కూడా మార్చి నెలలోనే లాంఛ్ కానుండగా బ్లాక్ కలర్ తో 6,000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో రాబోతున్న ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

    వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ మార్చ్ లో లాంఛ్ కానుండగా ఈ ఫోన్ ధర 47,000 రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో 8జీబీ ర్యామ్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం.