స్కూళ్లకు వచ్చుడు స్టూడెంట్ల ఇష్టమే..!

కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలు చేసిన కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టింది. ఒక్కో నెల ఒక్కో వాటికి పర్మిషన్‌ ఇస్తూ వస్తోంది కేంద్రం. ఈనెలతో అన్‌లాక్‌ 4.0 ప్రారంభమైంది. అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా 9‌‌–12 తరగతి విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలను అనుమతినిచ్చింది. తాజాగా వీటికి సంబంధించిన ఎస్‌ఓపీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. టీచర్లు, స్టూడెంట్లు పాటించాల్సిన రూల్స్‌ను అందులో పేర్కొంది. స్టూడెంట్స్‌ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చని.. లేదంటే ఆన్‌లైన్‌లోనూ […]

Written By: NARESH, Updated On : September 9, 2020 10:30 am

School in telangana

Follow us on

కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలు చేసిన కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టింది. ఒక్కో నెల ఒక్కో వాటికి పర్మిషన్‌ ఇస్తూ వస్తోంది కేంద్రం. ఈనెలతో అన్‌లాక్‌ 4.0 ప్రారంభమైంది. అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా 9‌‌–12 తరగతి విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలను అనుమతినిచ్చింది. తాజాగా వీటికి సంబంధించిన ఎస్‌ఓపీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. టీచర్లు, స్టూడెంట్లు పాటించాల్సిన రూల్స్‌ను అందులో పేర్కొంది. స్టూడెంట్స్‌ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చని.. లేదంటే ఆన్‌లైన్‌లోనూ క్లాస్‌ వినొచ్చని సూచించింది. ఆ ఆప్షన్‌ను స్టూడెంట్స్‌కు వదిలేసింది. అందుకు పేరెంట్స్‌ లేదా గార్డియన్స్‌ నుంచి లిఖితపూర్వకంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంది.

Also Read : అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

అయితే.. ఈ రూల్స్‌ ఓన్లీ కంటైన్‌మెంట్‌ జోన్లకు బయట ఉన్న స్కూళ్లకు మాత్రమే. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న స్కూళ్లు, కాలేజీలు తెరువడానికి వీల్లేదు. ఆయా జోన్ల పరిధిలోని స్కూళ్లకూ స్టూడెంట్లను అనుమతించరు. విద్యార్థులు, టీచర్లు కంటైన్‌మెంట్‌ జోన్లను సందర్శించరాదని ఆదేశించింది. అలాగే.. రీ ఓపెన్‌కి ముందే లేబరోటరీస్‌తో సహా క్లాస్‌ రూమ్‌లను అన్నింటినీ 1 శాతం సోడియం హైపోక్లోరైడ్‌ సొల్యూన్‌తో శానిటైజ్‌ చేయాలని పేర్కొంది. గతంలో క్వారంటైన్‌ సెంటర్స్‌గా కొనసాగిన వాటిలో డీప్‌ క్లీనింగ్‌, శానిటైజ్‌ చేయాలి. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ మొత్తం కలిపి 50 శాతం స్టాఫ్‌ మించరాదు.

వీటితోపాటు.. స్కూల్‌ మేనేజ్‌మెంట్లు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌కు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరడుగుల ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. దాని ప్రకారమే విద్యార్థులకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలి. స్కూల్‌ ఆవరణలోనే హ్యాండ్‌ వాష్‌ సదుపాయం కల్పించాలి. స్టాఫ్‌ రూమ్స్‌, లైబ్రరీల్లోనూ ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి. ఔట్‌ సైడ్‌ యాక్టివిటిస్‌ నిర్వహించాలనుకుంటే కరోనా రూల్స్ పాటించాలి. స్కూళ్లు, కాలేజీల లోపలికి ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతించాలి. ఎవరైనా టీచర్‌‌ లేదా స్టూడెంట్‌ లేదా స్టాఫ్‌ కరోనా లక్షణాలతో కనిపిస్తే సమీపంలోని హెల్త్‌ కేర్‌‌ సెంటర్‌‌కు పంపించాలి. అంతేగాకుండా.. స్కూల్‌ గోడలపై కరోనా మీద అవగాహన వచ్చేలా పోస్టర్లను అంటించాలి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తే వాటినీ పూర్తస్థాయిలో శానిటైజ్‌ చేయాలి.

టాయిలెట్స్‌ను మరియు స్కూల్‌ ఫ్లోర్స్‌నూ ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. టాయిలెట్స్‌లో సోప్‌ లేదా హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌ను పెట్టాలి. ఫ్రీటైమ్‌లో కానీ.. స్కూల్‌ వదిలాక కానీ స్టూడెంట్లు గుమికూడకుండా వారికి సరైన అవగాహన కల్పించాలి. విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. ఆ స్టూడెంట్‌ను ఓ గదిలో ఐసోలేట్‌ చేయాలి. తదుపరి హెల్త్‌ సెంటర్‌‌ను సంప్రదించి కరోనా టెస్టు చేయించాలి అని కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.

Also Read : స్ఫూర్తినిస్తున్న ఐపీఎల్ పాట.. వింటే అదుర్స్?