జగన్ ప్రభుత్వంపై పోరాటంలో కోర్టులనే టీడీపీ ఆయుధంగా వాడుతోంది. జగన్ సర్కార్ ను ముందుకెళ్లకుండా ఏపీ సర్కార్ ముందరికాళ్లకు బంధం వేస్తోంది. ఇందుకోసం టీడీపీ ప్రతిసారి వాడుతున్న కోర్టులనే ఆశ్రయిస్తూ ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న చంద్రబాబుకు షాకిస్తూ తాజాగా అమరావతి కుంభకోణంపై జగన్ సర్కార్ హైకోర్టునే ఆశ్రయించడం సంచలనమైంది. అమరావతిపై సీబీఐని దించేందుకు ఏపీ సీఎం జగన్ నడుం బిగించాడు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Also Read : అమరావతి రైతులకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వనుందా….?
గత చంద్రబాబు సారథ్యంలోని టిడిపి పాలనలో అమరావతి రాజధాని పేరుతో జరిగిన మోసాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సిబిఐని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించి సంచలనం సృష్టించింది. ఇప్పుడీ వార్త ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.
అమరావతి కుంభకోణంపై ఇప్పటికే జగన్ సర్కార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును చేస్తోంది. అయితే సిట్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదిస్తున్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఈమేరకు అమరావతి కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థించారు.
గత ప్రభుత్వం చేసిన కుంభకోణంలో సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుత రిట్ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రతివాదులుగా చేయాలని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వానికి నాడు చంద్రబాబు పరిపాలనా విధానాలను సమీక్షించే అధికారం ఉందని, దానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవని ఆయన వాదించారు. సిఆర్‌పిసి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, చట్ట ఉల్లంఘన లేదని ఆయన అన్నారు.
Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!
అమరావతి కుంభకోణంపై దర్యాప్తు వద్దంటూ తెలుగుదేశం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును కోరిన ఏజి, పిటిషనర్లు సైతం ఈ భూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీకి సహకరిస్తున్నారని వాదించారు. వారికి స్వయంగా ప్రాథమిక హక్కులు లేదా చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన లేనందున ఈ కేసులో వారికి ప్రమేయం అవసరం లేదని ప్రభుత్వం ఏజీ హైకోర్టుకు విన్నవించారు. అమరావతి కుంభకోణం విషయం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వ్యక్తిగతంగా పిటీషనర్లను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడంలో పిటిషనర్లు విఫలమయ్యారని ఏజీ వివరించారు. అలాగే, ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను వారు కోర్టు ముందు ఉంచలేదని ఆయన అన్నారు.
అమరావతి కుంభకోణంపై జరుగుతున్న ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక కోర్టును కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇదివరకే లేఖ రాసిందని, ఇంకా హైకోర్టు స్పందన కోసం వేచి ఉందని ఏజి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Also Read : మందుబాబులకు మళ్లీ షాక్ ఇస్తోన్న జగన్ సర్కార్