Homeజాతీయ వార్తలుUnion Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్- 2023లోని ముఖ్యాంశాలు ఇవీ.. ఏ రంగానికి...

Union Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్- 2023లోని ముఖ్యాంశాలు ఇవీ.. ఏ రంగానికి ఎంతంటే?

Union Budget 2023 Highlights: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయా రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామన్నారు. తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపయిందని, ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. గత బడ్జెట్ వేసిన పునాదిలపై ఇది నిర్మాణాలు సాగిస్తుందని ఈ సందర్భంగా నిర్మల బడ్జెట్ లో కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను సమర్పిస్తూ నిర్మల మాట్లాడుతూ “అమృత్‌కాల్‌లో ఇదే తొలి బడ్జెట్‌.’ అంటూ తమ ప్రభుత్వ ఘనతను చెప్పుకొచ్చారు.. మరి బడ్జెట్ ఎలా ఉంది? ఏ రంగానికి ఎంత కేటాయించారన్నది తెలుసుకుందాం.

-బడ్జెట్ లోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవీ

-2023 బడ్జెట్‌లో ఏడు ప్రాధాన్యతలు ఉన్నాయి మరియు అవి ఇన్‌ఫ్రా, గ్రీన్ గ్రోత్, ఫైనాన్షియల్ సెక్టార్, యువశక్తి.
-ప్రస్తుత సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి 7.0%గా అంచనా వేయబడింది, మహమ్మారి మరియు యుద్ధం కారణంగా సంభవించిన భారీ ప్రపంచ మందగమనం ఉన్నప్పటికీ, ఇది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యధికం.
-రైల్వేకు రూ.2.40 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
-రాష్ట్రాలకు వడ్డీ లేకుండా అందించేందుకు రూ.13.7 లక్షల కోట్లు కేటాయించారు.
– తలసరి ఆదాయం రెండింతలు పెరిగి రూ.1.97 లక్షలకు చేరుకుంది.
-ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు
-కరువు పీడిత మధ్య కర్ణాటక ప్రాంతానికి రూ.5,300 కోట్ల సాయం.
– గత 9 సంవత్సరాలలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 10వ స్థానం నుండి 5వ స్థానంలో ఉంది.
-పశుపోషణ, డెయిరీ, మత్స్య రంగాలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచనున్నారు.
-కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో హైలెట్ ఏంటంటే.. ఏపీ సహా తెలంగాణ వంటి రాష్ట్రాలకు అప్పుల కోసం అగచాట్లు పడుతున్నాయి. వాటికి బడ్జెట్ లో 13.7 లక్షల కోట్లు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇది రాష్ట్రాలకు గొప్ప ఊరటగా చెప్పొచ్చు. ఇక బడ్జెట్ లో రాజకీయ కోణం కూడా ఉంది. మరో మూడు నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా కేంద్రంలోని బీజేపీ కర్ణాటకకు 5300 కోట్ల సాయం ప్రకటించింది. దీనివెనుక ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular