Homeజాతీయ వార్తలుNew Record For Yogi Adityanath: యూపీలో యోగి సాధించిన రికార్డులు ఏంటి?

New Record For Yogi Adityanath: యూపీలో యోగి సాధించిన రికార్డులు ఏంటి?

New Record For Yogi Adityanath:  దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించింది. దీంతో అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదే పడింది. దేశంలోనే పెద్ద రాష్ట్రం కావడంతో సహజంగానే యూపీపై అందరు ఫోకస్ పెట్టారు. సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ప్రభావంతోనే బీజేపీ విజయం సాధించిందని తెలుస్తోంది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయం కూడా యోగి గెలుపుకు బాటలు వేశారు. ఈ నేపథ్యంలో యోగి పలు రికార్డులను బద్దలు కొట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎవరు సాధించని ఘనత సొంతం చేసుకోవడం తెలిసిందే.

New Record For Yogi Adityanath:
New Record For Yogi Adityanath:

ఇందులో గత ముప్పై ఏడేళ్లుగా ఒకే సీఎం రెండు సార్లు వరుసగా గెలవడం అనేది జరగలేదు. దీంతో ఆ రికార్డును అధిగమించారు. అయిదేళ్లు పాలన సాగించి మరోమారు సీఎంగా గెలిచి మరో రికార్డు సాధించారు. వరుసగా రెండో సీఎం అయిన వారిలో యోగి అయిదో వారు కావడం గమనార్హం. పదిహేనేళ్లుగా డైరెక్టు ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం కావడం తెలిసిందే. నోయిడాకు వెళ్లిన వారు పదవులు పొందిన దాఖలాలు లేని సందర్భంలో మోడీ, యోగి ఎన్నికల్లో గెలవడం కూడా ఓ అరుదైన విషయమే. బీజేపీ నుంచి పోటీ చేసి మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన రికార్డు కూడా తిరగరాశారు.

Also Read:  సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

దీంతో ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ యూపీలో రికార్డుల మోత మోగించిన సీఎంగా వినతికెక్కారు. మరోవైపు కాబోయే పీఎం అని కూడా కీర్తిస్తున్నారు. ఎందుకంటే మోడీ వయసు ప్రభావంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో యోగిని తీసుకొస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమలో ప్రశంసల జల్లుల్లో తడిసిపోతున్నారు. బీజేపీకి దొరికిన ఆణిమత్యం అని కితాబిస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ఎన్నో కోణాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

yogi adityanath
yogi adityanath

ఇన్నాళ్లు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన వారెటు పోయారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మూడో కూటమి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని ఎద్దేవా చేస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాక అందరిలో ఒకటే భయం పట్టుకుంది. బీజేపీని ఎదిరించడం అంత సులువు కాదనే విషయం స్పష్టమైపోయింది. ఎన్నికల వ్యూహకర్త పీకే సైతం బీజేపీని ఇప్పట్లో ఎదుర్కోవడం అంత సులువు కాదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అందుకే ఈ ఫలితాలు వారికి చెంపపెట్టు అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Also Read: కేసీఆర్ చేయినొప్పికి అదే కార‌ణం.. సీఎం ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన డాక్ట‌ర్లు..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Tirumala History:  కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. తిరుమల కొండపై వెలసిన దేవదేవుడు మహావిష్ణువు అవతారంగా చెబుతారు. కోరిన కోర్కెలు తీర్చే వెంకటేశ్వరుడి ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు ఈ ఆలయం ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఎవరికి కల వచ్చింది? ఏమిటా రహస్యం అనే వాటిపై తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular