https://oktelugu.com/

పేదలకు కేంద్రం శుభవార్త.. ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిన్న బడ్జెట్ సందర్భంగా పేదలకు తీపి కబురు చెప్పింది. ఉజ్వల స్కీమ్ ద్వారా మరో కోటి మందికి గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం కల్పిస్తామని తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉజ్వల స్కీమ్ ప్రయోజనాలు మరింత మందికి అందనున్నాయి. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రకటించింది. గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ లో భాగంగా ప్రధాన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2021 10:46 am
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిన్న బడ్జెట్ సందర్భంగా పేదలకు తీపి కబురు చెప్పింది. ఉజ్వల స్కీమ్ ద్వారా మరో కోటి మందికి గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం కల్పిస్తామని తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉజ్వల స్కీమ్ ప్రయోజనాలు మరింత మందికి అందనున్నాయి. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రకటించింది.

    గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ లో భాగంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను పొందిన వారికి కేంద్రం మూడు నెలల పాటు నెలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇచ్చింది. కష్టకాలంలో కేంద్రం గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంపై పేదల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ స్కీమ్ బెనిఫిట్స్ మరింత మందికి చేకూరే విధంగా కేంద్రం అడుగులు వేయడంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

    దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల వలస కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న రుణంపై లక్షన్నర రూపాయల వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం పీఏంఏవై స్కీమ్ ద్వారా అందుబాటులో ధరల్లో గృహాలను నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో సంవత్సరం పాటు పొడిగించనుంది.

    కేంద్రం దేశంలోని 15 వేల ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను చేపట్టనుంది. మౌలిక, తయారీ రంగాలకు కేంద్రం భారీగా కేటాయింపులు పెంచడంతో యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.