బాబు గారూ ఇదేమి రాజకీయం : ఆశ్చర్యపోతున్న టీడీపీ క్యాడర్‌‌

ఎవరి సైజుకు తగినట్లుగా వారు వేసుకుంటేనే అందం. అవి బట్టలయినా.. లేక చెప్పులయినా.. మన సైజుకు తగ్గట్టు కొనుక్కొని వేసుకుంటే నప్పుతాయి. కానీ.. అదేంటో అన్నీ తెలిసిన చంద్రబాబు ఏపీలో మాత్రం బీజేపీ కొనుక్కున్న చెప్పుల్లో కాలు పెడుతా అంటున్నారు. ఎందుకంటారా..! ఎప్పటికున్నా మళ్లీ బీజేపీతో అంటకాగాలన్న ఆయన ప్రయత్నం అనేదే అర్థమవుతోంది. అంతేకాదు.. బీజేపీ కామన్‌గా హిందుత్వ పార్టీ. ఇప్పుడు ఏపీలో మత రాజకీయాలూ పెరిగిపోయాయి. వీటన్నింటి నేపథ్యంలో బాబు కూడా అతి తెలివితో ఈ […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 2:39 pm
Follow us on


ఎవరి సైజుకు తగినట్లుగా వారు వేసుకుంటేనే అందం. అవి బట్టలయినా.. లేక చెప్పులయినా.. మన సైజుకు తగ్గట్టు కొనుక్కొని వేసుకుంటే నప్పుతాయి. కానీ.. అదేంటో అన్నీ తెలిసిన చంద్రబాబు ఏపీలో మాత్రం బీజేపీ కొనుక్కున్న చెప్పుల్లో కాలు పెడుతా అంటున్నారు. ఎందుకంటారా..! ఎప్పటికున్నా మళ్లీ బీజేపీతో అంటకాగాలన్న ఆయన ప్రయత్నం అనేదే అర్థమవుతోంది. అంతేకాదు.. బీజేపీ కామన్‌గా హిందుత్వ పార్టీ. ఇప్పుడు ఏపీలో మత రాజకీయాలూ పెరిగిపోయాయి. వీటన్నింటి నేపథ్యంలో బాబు కూడా అతి తెలివితో ఈ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: అచ్చెన్నను మళ్లీ జైలుకు పంపిన వైసీపీ సర్కార్

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీయార్ అందరి వాడుగా నిలిచారు. ఆయన సినీ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించి కులమత రహితంగా అందరికీ ఆరాధ్యుడు అయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. నాడు పార్టీ రాజ్యాంగాన్ని రామారావు తన సినీ అనుభవంతో, పరకాయ ప్రవేశం ద్వారా పోషించిన పాత్రల అనుభవాన్ని రంగరించి తీర్చిదిద్దారు. పేదవాడు అజెండాగా పార్టీకి పరుగులు పెట్టించారు. కానీ.. ఆ పవిత్రమైన పార్టీ రాజ్యాంగం చంద్రబాబు అధ్యక్షుడు అయ్యాక ఎన్నోమార్లు సవరణలకు గురయింది.

Also Read: తొలి సారి బీజేపీ బడ్జెట్ పై శివాలెత్తిన వైసీపీ

ఇక.. ఎన్టీయార్ పార్టీ పెట్టడానికి అసలైన ప్రాతిపదికే కాంగ్రెస్ వ్యతిరేకత. కాంగ్రెస్ వట వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు రామారావు తన పద్నాలుగేళ్ల రాజకీయాన్ని పూర్తిగా వెచ్చించారు, దాని కోసమే విరామమెరుగని పోరాటం చేశారు. ఆ కృషి ఫలితమే దేశంలో 1989 నాటికి నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి రావడం. అలా మరో జయప్రకాష్ నారాయణ్ అయ్యారు రామారావు. మరి ఆయన కాంగ్రెస్ వ్యతిరేక పునాదిని కూడా చంద్రబాబు కుదిపి కదిపేశారు. 2018 ఎన్నికల వేళ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అందులో తప్పు లేదని వాదించారు. రామారావు రాజ్యాంగాన్ని తానే స్వయంగా సవరించేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఏపీలో ఇప్పుడు బీజేపీకి ఓ నాలుగు ఓట్లు రాలుతాయన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. అందుకే ఆయన రామతీర్ధం రావడం, రచ్చ చేయడం ప్రారంభించేశారు. అలాగే ధర్మ పరిరక్షణ దీక్ష పేరిట ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాన్ని టీడీపీ కార్యకర్తలు కనీసం కలలో కూడా ఊహించి ఉండరేమో. మా బాబు ఏంటి.. ఈ మత రాజకీయాలు ఏంటి అని ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్‌‌ ముక్కున వేలేసుకుంటోంది. మరీ ఇలా గాలివాటం రాజకీయాలు చేస్తే ఎలా అన్నది పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉంటున్న వారి ఆవేదన.