Trivikram-Mahesh Babu : కొన్ని కాంబినేషన్స్ కి ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాటిలో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వసూళ్ల లెక్కకు పక్కన పెడితే మహేష్ నటించిన అతడు, ఖలేజా మహేష్ ఫ్యాన్స్ ఆల్ టైం ఫేవరేట్ లిస్ట్ లో ఉంటాయి. ముఖ్యంగా అతడు ఆంధ్రుల అభిమాన చిత్రం. బుల్లితెర టీఆర్పీ కింగ్. గత దశాబ్దన్నర కాలంలో అతడు వందలసార్లు స్టార్ మాలో ప్రసారమైంది. ఆదరణ మాత్రం అసలు తగ్గిన దాఖలాలు లేవు. కారణం అతడు ఆడియన్స్ కి ఫుల్ మీల్ లాంటి మూవీ. యాక్షన్, ఎమోషన్, లవ్, కామెడీ, మ్యూజిక్ వంటి కమర్షియల్ అంశాలు సమపాళ్లలో మిక్స్ చేసి ఫీల్ గుడ్ మూవీ అందించారు.

క్లాస్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కామన్ ఎంటర్టైనర్ అతడు. ముఖ్యంగా మహేష్ క్యారెక్టర్ త్రివిక్రమ్ రాసుకున్న తీరు అద్భుతం. చల్లని మంచుతో కప్పబడిన అగ్నిపర్వతంలా మహేష్ రోల్ ఉంటుంది. అనుబంధాలంటే ఏమిటో తెలియని కాంట్రాక్ట్ కిల్లర్ కరుకైన హృదయాన్ని సంబంధం లేని అమాయక మనుషుల ప్రేమలు చుట్టుముడితే… ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో, బాగా చెప్పారు.
మహేష్ సెటిల్డ్ యాక్టింగ్ తో తనలోని కొత్త యాంగిల్ ఆవిష్కరించారు. బావను పిచ్చిగా ప్రేమించే పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా త్రిష, హీరోని ఇబ్బంది పెట్టాలని చూసి తానే ఇరుకున పడే బిల్డప్ బాబాయ్ పాత్ర చేసిన బ్రహ్మానందం… అతడు చిత్రానికి హైలెట్. త్రివిక్రమ్ మాటలు, కామెడీ పంచెస్ నభూతో నభవిష్యతి. అతడు థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. కానీ మంచి చిత్రంగా నిలిచిపోయింది.
అతడు విడుదలైన ఐదేళ్లకు 2010లో ఖలేజా చిత్రం చేశారు. ఓ వినూత్న సబ్జెక్టు మహేష్ తో డీల్ చేయాలని త్రివిక్రమ్ ట్రై చేశాడు. అయితే ప్రేక్షకుల్లో అది తప్పుగా ప్రొజెక్ట్ అయ్యింది. ఆధునిక యుగంలో దేవుడుకి అర్థం చెప్పే క్రమంలో తడబడ్డ త్రివిక్రమ్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. ఖలేజా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ మహేష్ మేనరిజం, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. ఎప్పటిలాగే త్రివిక్రమ్ డైలాగ్స్ జనం నోళ్ళలో నానాయి.
దశాబ్దం తర్వాత మహేష్-త్రివిక్రమ్ మళ్ళీ కలిశారు. ఎస్ఎస్ఎంబీ 28 చిత్రం చేస్తున్నారు. వీరి గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెట్స్ పై ఉన్న ఈ చిత్రం త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా 2024 ఆరంభంలో విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. పెన్ను-గన్ను కలిసి చేస్తున్న ఈ చిత్రం మహేష్ అభిమానుల్లో నిలిచిపోయే మరో మరపురాని చిత్రం అవుతోందని భావిస్తున్నారు.