Oscar award RRR : ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కోసం వరల్డ్ వైడ్ 300లకు పైగా చిత్రాలు పోటీపడుతున్నారు. అందులో పది చిత్రాలు ఇండియన్ మూవీస్ ఉన్నాయి. కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్ తో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. అయితే అందరి దృష్టి ఆర్ ఆర్ ఆర్ మీదే. ఆర్ ఆర్ ఆర్ మూవీ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించగా నామినేట్ కావడం, ఆస్కార్ అందుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాల భవితవ్యం జనవరి 24న తేలనుంది. అకాడమీ సభ్యులు నామినేట్ అయిన చిత్రాల జాబితా ఆ రోజు విడుదల చేస్తారు. ప్రతి కేటగిరీ నుండి ఐదు చిత్రాలు పోటీపడతాయి.

జనవరి 12 నుండి 17వరకు అకాడమీ సభ్యులు షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు పదివేల మంది అకాడమీ సభ్యులు ఈ ఓటింగ్ లో భాగమయ్యారు. ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ అత్యంత క్లిష్టం. అకాడమీ మెంబర్స్ దృష్టిలో పడేందుకు మూవీ మేకర్స్ పెద్ద ఎత్తున క్యాంపైన్ చేస్తారని సమాచారం. ఎందుకంటే వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేసిన చిత్రాలకు వారు ఓటింగ్ వేస్తారు.
ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుని అందరి దృష్టి ఆకర్షించింది. యూఎస్ లో భారీ వసూళ్లు సాధించింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే హాలీవుడ్ మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ విధంగా ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేసింది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందన్న ఆశాభావం మేకర్స్ లో ఉంది.
మరో నాలుగు రోజుల్లో దీనిపై ఉత్కంఠ వీడనుంది. కాగా ఇండియా నుండి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అధికారిక ఆస్కార్ ఎంట్రీ దక్కలేదు. ఈ పరిణామం తీవ్రంగా నిరాశపరిచిందని రాజమౌళి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలా అని రాజమౌళి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులను తప్పుబట్టలేదు. మేము బాధపడుతూ కూర్చోకుండా ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ దాదాపు రూ. 1200 కోట్ల వసూళ్లు సాధించింది.