Top Ten Flop SUVs: కారు కొనాలనుకునే వారు ఎక్కువ శాతం SUVలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హైఫై ఫీచర్స్, కంపోర్ట్ సీటింగ్ తో పాటు బలమైన ఇంజిన్ వ్యవస్థ ఇందులో ఉండడంతో వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు SUV మోడళ్లను రోడ్లపై తిప్పుతున్నాయి. అయినా అప్డేట్ ఫీచర్స్ తో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే SUV కార్లలో అన్నీ సక్సెస్ అయ్యాయని చెప్పలేం. ఇలాంటి తరహాలో కొన్ని కంపెనీలు కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్లో రిలీజ్ చేసినా ఆకట్టుకోలేకపోయాయి. అలా ఫ్లాప్ అయిన SUVల గురించి తెలుసుకుందాం.
రెనో క్యాప్చర్:
భారత ఆటోమోబైల్ మార్కెట్లో ఫ్రెంచ్ కార్ రెనో డస్టర్ ఓ వెలుగు వెలిగింది. అయితే 2022 దీని ఉత్పత్తిని నిలిపి వేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా రెనో కంపెనీ ‘క్యాప్చర్’ ను తీసుకొచ్చింది. 1.5 లీటర్ డీజిల్, 1.6 పెట్రోల్ ఇంజిన్ కలిగిన దీనిని యూరోపియయన్ క్రాస్ ఓవర్ డిజైన్ చేశారు. అయితే ఇది భారతీయులను ఆకట్టుకోలేదు. సాధారణంగా SUV అంటే నిటారుగా ఉండే కార్లు అని భావిస్తారు. కానీ SUV పేరు చెప్పి హైట్ తక్కువగా ఉండడంతో కంపోర్ట్ లేదని భావించారు.
రెనో కొలియోస్:
అచ్చం డస్టర్ మోడల్ లోనే దీనిని తయారు చేశారు. ఫ్రెంచ్ స్టైలింగ్ తో కూడిన ఇది 2.0 డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. బోస్ సౌండ్ సిస్టమ్ తో సహా డస్టర్ లో ఉండే అన్నీ లక్షణాలు ఇందులో ఉన్నాయి. కానీ దీనిని రిలీజ్ చేసే సమయంలో ఇండియన్స్ ఎక్కువగా ఖరీదైన కార్లకోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కొలియోస్ ను ఎవరూ పట్టించుకోలేదు. అలా ఈ మోడల్ ప్లాప్ అయింది.
నిస్సాన్ ఎక్స్ ట్రైల్:
రెనో కొలియోస్ ఫెయిల్ అయిన తరువాత అదే మోడల్ లో ఎక్స్ ట్రేల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు టర్కీ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. అయితే దీని ధర ఎక్కువగా ఉండి ఫీచర్లు ఆకట్టుకోకపోవడంతో భారత మార్కెట్లలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
నిసాన్ కిక్స్:
భారత మార్కెట్లో అప్పటికే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లో హవా కొనసాగిస్తున్నాయి. వీటికి పోటి ఇచ్చేందుకు నిసాన్ కిక్స్ ను ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ లెవల్లో స్పెక్ డిజైన్ తో పాటు మంచి ఫీచర్లను కలిగి ఉన్న ఈ మోడల్ ను తయారు చేసేందుకు ఇంజనీర్లు చాలా కష్టపడ్డారట. కానీ ఇది అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.
వోక్స్ వ్యాగన్ ఫ్లాగ్ షిప్:
ప్రత్యేకమైన స్పీడ్ ను కలిగి ఉన్న వోక్స్ వ్యాగన్ ఫ్లాగ్ షిప్ ధర కాస్త ఎక్కువే. దీంతో అంతే రేటుతో ఉన్న బ్రాండెడ్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ మోడల్ ఫెయిల్ అయిందనే చెప్పాలి.
చెవ్రోలెట్ ఫారెస్టర్:
ఇండియాలో అఫీషియల్ గా విక్రయించబడిన SUVలల్లో చెవ్రోలెట్ ఫారెస్ట్ ఒకటి. ఇది సుబారు ఫారెస్టర్ యొక్క రీ బ్యాడ్జ్ వెర్షన్. ప్రత్యేకమైన ఫ్రేమ్ లెస్ డోర్లు కలిగి ఉన్నప్పటికీ ఈ మోడల్ ఆకట్టుకోలేకపోయింది.
చెవ్రోలెట్ ట్రేబ్లేజర్:
చెవ్రోలెట్ నుంచి సరికొత్త మోడల్ గా ఉత్పత్తి చేయబడ్డ మోడల్ ట్రే బ్లేజర్. బలమైన డీజిల్ ఇంజిన్, గంభీరమైన రూపాన్ని కలిగినా ఇది భారతీయులను ఆకర్షించలేదు.
మిత్సుబిషి మోంటెరో:
నాల్గోతరం పజెరోగా ఇండియాకు వచ్చిన మోడల్ మిత్సుబిషి మోంటెరో. 3.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇన్నప్పటికీ మోంటెరో ఆలస్యంగా మార్కెట్లోకి రావడంతో మోడల్ ఆకర్షించలేదు.
ప్రీమియర్ రియో:
ఇండియాలో మొట్టమొదటి సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ SUV పరిగణించబడిన మోడల్ రియో. 2008కి రీ బ్యాడ్జ్ చేయబడిన వెర్షన్ ఇది. ప్యుగోట్ మూలంగా ధర ఎక్కువగా నిర్ణయించారు. దీంతో మొదట్లోనే అమ్మకాలు అంతగా సాగలేదు. ఆ తరువాత సర్వీస్ కూడా ఫెయిల్ కావడంతో ఈ మోడల్ ఫెయిల్ అయిందనే చెప్పాలి.
మిత్సుబిషి అవుట్ ల్యాండర్:
భారతీయ కారు మార్కెట్లో మిత్సుబిషి అవుట్ ల్యాండర్ మోడల్ చాలాకాలంగా కొనసాగింది. దీనికి సంబంధించి రెండో, మూడో ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 2.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఈ మోడల్ ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఫెయిల్ అయిందనే చెప్పాలి.