Chiranjeevi Tweet
Chiranjeevi Tweet: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు కాసేపటి క్రితమే ఒక పాప పుట్టింది అనే వార్త మెగా అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసింది. ఎప్పటి నుండో ఈ వార్త కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పదేళ్ల ఎదురు చూపులకు మొత్తానికి నేటితో తెరపడింది. నిన్న ఉదయమే ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.
ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు స్వయంగా అధికారికంగా ప్రకటించడం తో మెగా ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు చేయించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బిడ్డ సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత ఉపాసన ప్రసవించినట్టు చెప్తున్నారు. మీడియా కి నేడు తెల్లవారు జామున అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ ప్రాంగణం మొత్తం అభిమానుల కోలాహలం తో దద్దరిల్లిపోయింది.
ఇక 7 వ సారి తాతయ్య అయిన చిరంజీవి కి ఎంత ఆనందం ఉంటుందో మాటల్లో చెప్పలేము. కాసేపటి క్రితమే ఆయనే ఈ విషయంపై ట్వీట్ వేస్తూ ‘ చిన్నారి దేవతకు స్వాగతం, నీ రాకతో కోట్లాది మంది మెగా అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయ్యింది. నీ రాకతో రామ్ చరణ్ , ఉపాసన జీవితాల్లో వెలుగుల్ని విరజిమ్ముతూ, మరోసారి నన్ను తాతయ్య ని చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ చిరంజీవి వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఇక మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయమై సంబరాలు చేసుకుంటూ కేక్ కట్టింగ్స్ చేస్తున్నారు. ఆలయాలలో బిడ్డ కోసం పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక బిడ్డకి ఏమి పేరు పెట్టబోతున్నారు ఏమిటి అనేది త్వరలోనే తెలియనుంది. ఇక రామ్ చరణ్ కి ఆడబిడ్డ పుట్టడం పై టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!!— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Chiranjeevi tweeted happily and proudly welcoming the little mega princess
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com