Top-10 grossers films: ఇన్నాళ్లు బాలీవుడ్ హిందీ సినిమాలకు దేశంలో పిచ్చ క్రేజ్ ఉండేది. ఆ తర్వాత దక్షిణాదిన తమిళ సినిమాలు సత్తా చాటేవి. కానీ తెలుగు నుంచి మన రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ‘ప్యాన్ ఇండియా’ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి అవతరించాడు. భాషా బేధం లేకుండా అందరినీ కూర్చుండబెట్టి సినిమాను మెప్పించగల దర్శకుడిగా రాజమౌళి నిలిచాడు.

తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్నటికే 1000 కోట్లు దాటి దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 3వ స్తానంలో నిలిచింది.
ఈ క్రమంలోనే దేశంలోనే ఆర్ఆర్ఆర్ కంటే కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ మూవీ దేశంలోనే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ 1 చిత్రంగా నిలిచింది.
ఇక రెండో స్థానంలో రాజమౌళి చెక్కిన బాహుబలి2 సినిమా నిలిచింది. ఇది 1819 కోట్లు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతానికి రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 3వ స్థానంలో ఉంది. ఈ సినిమా అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 1000 కోట్లు వసూళ్లు గ్రాస్ సాధించి దూసుకెళుతోంది.. ఇకో నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ ఉంది. ఈ సినిమా సల్మాన్ కెరీర్ లోనే అత్యధికంగా 969 కోట్లు కలెక్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం కలెక్షన్ల తీరు చూస్తుంటే ఇది రెండో స్థానంలో ఉన్న బాహుబలి2 కలెక్షన్ల వరకూ చేరడం కష్టమేనని అంటున్నారు.
ఇక దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 5వ స్థానంలో అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’.. 967 కోట్లు.. 6వ స్థానంలో పీకే 854 కోట్లు, 7వ స్థానంలో రోబో 2.0 800 కోట్లు.. 8వ స్థానంలో బాహుబలి1 650 కోట్లు, 9వ స్తానంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ 623 కోట్లు.. 10వ స్తానంలో ‘సంజు’ 587 కోట్లు సాధించింది.
ఇలా దేశంలోనే టాప్ 3లో రెండు రాజమౌళి చిత్రాలే ఉండడం గర్వకారణం అని చెప్పొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు టాప్ 1లో ఉన్న అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాను కూడా రాజమౌళి బద్దలుకొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా తన సినిమానే నిలుపుతాడని ప్రేక్షకులు ఘంటాపథంగా చెబుతున్నారు.