https://oktelugu.com/

వాహనదారులకు షాక్.. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?

మన దేశంలోని ప్రజలు ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులపై ప్రత్యక్షంగా ప్రజలపై పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. వరుస నాలుగు రోజుల నుంచి పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తులో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..? దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర 26 నుంచి 29 పైసలు […]

Written By: , Updated On : February 12, 2021 / 12:04 PM IST
Follow us on

Petrol And Diesel Prices Today

మన దేశంలోని ప్రజలు ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులపై ప్రత్యక్షంగా ప్రజలపై పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. వరుస నాలుగు రోజుల నుంచి పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తులో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..?

దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర 26 నుంచి 29 పైసలు పెరగగా డీజిల్ ధర 34 నుంచి 38 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 94.28 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 87.62 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర 91.65 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 85.50 రూపాయలుగా ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో పెట్రోల్ ధర ఏకంగా 94.64 రూపాయలకు చేరింది.

Also Read: హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం.. రాష్ట్రపతికి మహిళ రాసిన లేఖ వైరల్..!

ముంబైలో లీటర్ డీజిల్ ధర 85.32 రూపాయలుగా ఉంది. ధరలు పెరగడం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఆరోసారి కావడం గమనార్హం. ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తుండగా కేంద్రం పన్నులు తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

గడిచిన 12 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు రూ.4.13, డీజిల్ రూ.4.26 పెరిగింది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరుతుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.