Times Now Survey : రాష్ట్రంలో ఎటువంటి సర్వేలు చేపడుతున్నా వైయస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ వెల్లడవుతోంది. ఏకపక్ష విజయంతో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని తేలుతోంది. తాజాగా మరో జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వైయస్సార్సీపీకి ఏకపక్ష విజయం దక్కనుందని స్పష్టమైంది. దీంతో వైయస్సార్సీపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైయస్సార్సీపీకి విజయం దక్కుతుందని ప్రతి సర్వే సైతం తెలియజేస్తోంది. అటు నిఘా వర్గాలు సైతం ఎప్పటికప్పుడు ప్రజల మూడ్ ను పసిగట్టి సీఎం జగన్ కు చేరవేస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ సర్వే చేపట్టింది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైయస్సార్సీపి 25 ఎంపీ స్థానాలు గాను అన్నింటినీ కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. టిడిపి ఒక ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉందని తేలింది. అయితే ఆ స్థానంలో పోటీ హారాహోరీగా ఉండబోతుందని.. వైయస్సార్సీపి గెలుపొందడానికే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. జనసేన ఖాతా కూడా తెరవదని సర్వే స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు అరెస్టుతో టిడిపికి సానుభూతి పెరిగింది అన్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఏపీ ప్రజలు వైయస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టడం విశేషం.
టైమ్స్ నౌ సంస్థ వరుసగా సర్వేలు చూపడుతూ వస్తోంది. ఏప్రిల్- మే, జూలై- ఆగస్టు లో సైతం సర్వే చేపట్టింది. అప్పుడు కూడా వైసీపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టింది. అయితే ఎప్పటికప్పుడు వైసిపి గ్రాఫ్ పెరుగుతుండడం విశేషం. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యం, టిడిపి తో జనసేన పొత్తు ప్రకటన తదితర కారణాలతో వైసిపి గ్రాఫ్ తగ్గిపోయిందని అంతా భావించారు. కానీ అదేది ప్రభావం చూపడం లేదని స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి 49.8% ఓట్లతో 22 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈసారి అంతకుమించి ఓట్ల శాతం పెరుగుతుందని సర్వే స్పష్టం చేసింది.
ఏపీలో జగన్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఎల్లో మీడియా ఘోషిస్తోంది. వైసీపీకి చాలా వర్గాలు దూరం అయ్యాయి అని చెప్పుకొచ్చింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తారని గోబెల్స్ ప్రచారం చేసింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో వైసీపీకి షాక్ తప్పదని హెచ్చరిస్తూ వచ్చింది. వైసీపీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య ఆదిపత్య పోరు అంటూ లేనిపోని ప్రచారానికి ఎల్లో మీడియా పూనుకుంది. అయినా ఏపీ ప్రజలు వైసీపీ వైపే మొగ్గుచూపడం విశేషం. అటు సంక్షేమంతో పాటు అభివృద్ధితో దూసుకెళ్తున్న జగన్ నాయకత్వాన్ని మరోసారి కోరుకోవడం స్పష్టంగా తెలుస్తోంది.
Times Now-@ETG_Research Survey
Lok Sabha 2024 | Andhra Pradesh: Total Seats: 25
Seat Share:
– YSRCP: 24-25
– TDP: 0-1
– JSP: 0
– NDA: 0
– Others: 0TDP has to re-invent itself: @ashutosh83B
Jagan Mohan Reddy is delivering his promises: @AbbayaChowdary tells @padmajajoshi pic.twitter.com/Eg6JSYXg8G
— TIMES NOW (@TimesNow) October 2, 2023