AP Liquor: ఏపీలో చెత్త బ్రాండ్లకు చెక్‌.. క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక అసలు కారణం ఇదే

ఏపీలో నాలుగున్నరేళ్లుగా అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల పై మందుబాబుల్లో వ్యతిరేకత వచ్చింది. అయినా జగన్‌ సర్కార్‌ వాటినే కొనసాగించింది. రాజకీయంగా కూడా కొత్త బ్రాండ్లపై విమర్శలు వచ్చాయి.

Written By: Raj Shekar, Updated On : February 4, 2024 11:24 am

AP Liquor

Follow us on

AP Liquor: ఆంధ్రప్రదేశ్‌ మందు బాబులకు ఓ గుడ్‌ న్యూస్‌. సార్వత్రిక ఎన్నికల వేళ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న కొత్త కొత్త మద్యం బ్రాండ్లు(జగన్‌ బ్రాండ్ల) స్థానంలో మళ్లీ పాత బ్రాండ్లను అనుమతించింది. దీంతో నాటి బ్రాండ్లు మళ్లీ మద్యం షాపుల్లో దర్శనమిస్తున్నాయి.

కొత్త బ్రాండ్లపై వ్యతిరేకత..
ఏపీలో నాలుగున్నరేళ్లుగా అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల పై మందుబాబుల్లో వ్యతిరేకత వచ్చింది. అయినా జగన్‌ సర్కార్‌ వాటినే కొనసాగించింది. రాజకీయంగా కూడా కొత్త బ్రాండ్లపై విమర్శలు వచ్చాయి. అయినా జగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. పైగా ధరలు కూడా పెంచారు. దీనికి మద్యం తాగడం మాన్పించడం కోసమే ధరలు పెంచుతున్నట్లు చెప్పారు. కానీ ఎన్నికల వేళ అనూహ్యంగా బార్లు, మద్యం దుకాణాల్లో అన్ని బ్రాండ్ల మద్యం దర్శనమిస్తోంది. ఎట్టకేలకు పాపులర్‌ బ్రాండ్ల కంపెనీలతో తాజాగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. పాత బ్రాండ్లు మళ్లీ రావడంతో మద్యం వ్యాపారం ఊపందుకుంటోంది.

ఎన్నికల కోసమేనా?
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. మద్యం షాపులు, బార్లలో అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు రావడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ఎన్నికల సమయంలో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు రూ.75 కోట్ల వ్యాపారం జరుగుతుండగా, పాత బ్రాండ్ల రాకతో రోజుకు మరో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.