Union Budget 2023: అంతర్జాతీయంగా అనిచ్చిత పరిస్థితులు… విపరీతంగా పెరుగుతున్న ధరలు.. రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి.. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు… ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం పార్లమెంటులో 2023_24 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇదే.. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో పన్ను మోత నుంచి కొంతైనా ఉపశమనం దొరుకుతుందని సామాన్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు, కొన్ని రకాల వస్తు, సేవల పన్ను శాతాల తగ్గింపు వంటి వాటిని నిర్మల ప్రకటిస్తారని, తమకు ఊరట కలిగిస్తారని బిజెపికి అత్యంత కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ద్వారా చేసే వ్యయాన్ని పెంచాలని పేదలు కోరుకుంటున్నారు.. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూనే.. ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పని విధంగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం నిర్మలా సీతారామన్ కు కత్తి మీద సాము అని చెప్పవచ్చు.. ఈసారి బడ్జెట్కు మరో ప్రత్యేకత కూడా ఉంది ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి శాంతించాక, రష్యా _ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య పెడుతున్న తొలి బడ్జెట్ ఇది.
ఈసారి బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన, ఉద్యోగాలు ఎక్కువగా కల్పించే రంగాలపైన, మరీ ముఖ్యంగా చిన్న వ్యాపారాల పైన కేంద్రం ఎక్కువగా దృష్ట్యారించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే గత అనుభవాల ఆధారంగా చూస్తే, చాలామంది ప్రజలు ఆశిస్తున్నట్లు మోడీ సర్కారు ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షణ నిర్ణయాలు ఏవీ ప్రకటించకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.. మధ్యతరగతి ప్రజలపై భక్తుల గురించి తనకు తెలుసు అని నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించినందున పన్ను చెల్లింపుదారులకు కాస్తంతైన ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు ఆమె తీసుకోవచ్చని మరికొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక భారత దేశంలో నిరుద్యోగ రేటు 2022 డిసెంబర్లో 16 నెలల గరిష్టానికి అంటే 8.3 శాతానికి చేరింది.. ప్రభుత్వానికి సవాల్ గా మారింది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మోడీ సర్కారు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచే అవకాశం ఉంది.. అలాగే పంట బీమా, గ్రామీణ రహదారులు, తక్కువ గేయంలో గృహ నిర్మాణం వంటి వాటిపైనా దృష్టి సారించే అవకాశం ఉంది.
గత బడ్జెట్లో ఇలా..
2022 _ 23 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక అభివృద్ధి 9.2 శాతంగా ఉండబోతోందని గత బడ్జెట్లో నిర్మల అంచనా వేశారు.. కానీ ఆర్థిక మాంద్యం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా రిజర్వ్ బ్యాంకు గత డిసెంబర్లో ఆ అంచనాను 6.8 గా సవరించింది.. ఆర్థిక మంత్రి అంచనా వేసిన సగటు తో పోలిస్తే తప్పిపోయినప్పటికీ అది తక్కువే అయినప్పటికీ… అంతర్జాతీయంగా పోలిస్తే అది మెరుగే.. ఆవాస్ యోజన కింద 2022_23 దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతంలో 80 లక్షల గృహాలు నిర్మించాలని 2022_ 23 బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ నలభై లక్షల లోపే ఇల్లు నిర్మించారు.. 2022_23 బడ్జెట్లో 3.8 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీటి కల్పనకు బడ్జెట్లో 600 కోట్లు ప్రతిపాదించారు.. కానీ వాస్తవంలో 1.7 కోట్ల ఇళ్ళకే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చింది.