https://oktelugu.com/

Photo Story: క్రికెట్ లెజెండ్ తో ఉన్న ఈ కుర్రాడు టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు.. ఇప్పుడు హీరో.. ఎవరో చెప్పుకోండి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులు ఎంతో మంది వచ్చారు. అందులో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన వారు ఇప్పుడు తమ కుమారులను రంగంలోకి దించుతున్నారు. తమలాగే వారు కూడా సినీ ఇండస్ట్రీలో రాణించాలని కాంక్షిస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2023 / 12:35 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సోషల్ మీడియా వచ్చాక చిన్న నాటి ఫొటోలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు ప్రత్యేక సందర్భాల్లో తమ చైల్డ్ పిక్స్ ను బయటపెడుతున్నారు. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఆయన ఓ స్టార్ హీరో కొడుకు. అంతేకాకుండా ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతలో ఈ పిక్ బయటపడింది. అయితే ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

    టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులు ఎంతో మంది వచ్చారు. అందులో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన వారు ఇప్పుడు తమ కుమారులను రంగంలోకి దించుతున్నారు. తమలాగే వారు కూడా సినీ ఇండస్ట్రీలో రాణించాలని కాంక్షిస్తున్నారు. అందరిలాగే హీరో శ్రీకాంత్ కూడా తన కుమారుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ.. ఇలా వివిధ వేరియంట్లలో నటించిన శ్రీకాంత్ అగ్రహీరోల్లో ఒకరుగా నిలిచారు. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా తన బాటలోనే వెళ్లాలని అనుకుంటున్నాడు.

    శ్రీకాంత్ కుమారుడు ఎవరో సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన పేరు రోషన్ మేక. ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. ఆ తరువాత ‘పెళ్లి సందడి’ సినిమాతో మెయిన్ హీరోగా మారాడు. ఈ సినిమాలో రోషన్ మేక కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆయనకు పలు అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ‘వృషభ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    ఈ తరుణంలో రోషన్ మేక కు సంబంధించిన చైల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో ఆయన దిగిన ఫొటోను శ్రీకాంత్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎర్రగా బుర్రగా ఉన్నా ఆయనను చూసి మెచ్చుకుంటున్నారు. అంతేస్థాయిలో ఇప్పటికీ రోషన్ ఎంతో అందంగా ఉంటాడు. అంతేకాకుండా ఆయనను టాలీవుడ్ హృతిక్ రోషన్ అని కూడా పిలుస్తున్నారు.