Wife victims : భార్య అంటే… భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం..

దీన్ని చూసి సాటి మగాళ్లు అంతా నవ్వుకొని గమ్మున ఉండడం తప్ప మరేం చేయలేరు అంతే.. భార్య అంటే... భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం అని సర్దిచెప్పుకోవాల్సిందే.. 

Written By: NARESH, Updated On : August 14, 2023 6:47 pm
Follow us on

Wife victims : పైకి మగరాయుళ్లు.. కానీ భార్య అంటే ఎంతో భయం.. నాగబాబు నుంచి సామాన్యుల దాకా బయట తొడలు కొట్టే బాలయ్య నుంచి మన బామ్మర్ధి వరకూ అందరికీ వాళ్ల ఆవిడంటే అంతే భయం..

కానీ అందరూ చేసే పని ఏంటంటే ఈ భయాన్ని బయటకు కనిపించకుండా కవర్ చేయడం.. మీరూ అదే చేస్తారు.. మేం కూడా అంతే.. ఈ భయాన్ని ఎలా తెలుపాలో.. బయటపడేయాలో తెలియక మగరాయుళ్లు, బార్లు, వైన్స్ వద్ద తాగేసి బోరున ఏడ్చేస్తుంటారు. కొందరు పెళ్లాలపై కారాలు మిరియాలు నూరుతుంటారు. సాటి మగాడికే ఈ బాధ తెలుస్తుంది.

భార్యల టార్చర్ తట్టుకోలే ‘భార్యా బాధితుల సంఘాలు’ వెలిశాయి. 1970వ దశకం తర్వాత ఆడవారిపై అఘాయిత్యాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆఫ్ కోర్స్ సమాజంలో కూడా ఆడవారిపై హత్యాలు, అత్యాచారాలతో వారి పక్షాన సమాజం చేరిపోయింది. ఆడది వంటింటి కుందేళ్లు కాదు అంటూ నినదించారు.

కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే సమాజంలో మగాడికి లేని హక్కులు, పత్రాలు, ఇతర వ్యవస్థల సపోర్ట్ మొత్తం అమ్మాయిలకే ఉంది. మీడియా ఏం జరిగినా అమ్మాయిల పక్షానే గళమెత్తుతుంది. సోషల్ మీడియాలో అంతా వాళ్ల రాజ్యమే. ఇన్ స్టా రీళ్లలో అయితే అమ్మాయిలదే హవా. మగాడి రీల్ మచ్చుకైనా కనిపించదు.

ఇక సమాజంలో ప్రతీ మగాడు దాదాపు ఎప్పుడో ఒకప్పుడు భార్య బాధితుడే. అందుకే ఇలాంటి బాధితుల బాధను ఒక్క కార్టూన్ తెలిపాడు మన ‘లేపాక్షి’. భార్య బాధితుల సమావేశం జరుగుతుండగా.. ‘ఒకామె తన భర్త కోసం వచ్చి బయట నుంచుందని అనౌన్స్ చేశారట.. అంతే అందర అందరూ వెనుక దారు నుంచి పారిపోయారు’ ఇలా భర్తల బాధను ఈ ఒక్క కార్టూన్ తో చెప్పేశారు.

దీన్ని చూసి సాటి మగాళ్లు అంతా నవ్వుకొని గమ్మున ఉండడం తప్ప మరేం చేయలేరు అంతే.. భార్య అంటే… భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం అని సర్దిచెప్పుకోవాల్సిందే..