Tollywood Industry : ఇండస్ట్రీ లో వరుస సక్సెస్ లు అందుకుంటున్న స్టార్ డైరెక్టర్లు వీళ్లే…

ఇక వీళ్ళ తర్వాత స్థానం లో అనిల్ రావిపూడి ఉంటాడు ఈయన చేసిన సినిమాలు కూడా అన్ని మంచి విజయాలను అందుకున్నాయి...

Written By: Gopi, Updated On : January 8, 2024 9:50 am
Follow us on

Tollywood Industry : సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ లు కొట్టడం చాలా కష్టం… అలాంటిది ఒక సినిమాతో సక్సెస్ సాధించాడు అంటే ఆ డైరెక్టర్ కి ఎంతో కొంత టాలెంట్ ఉందని అందరూ ఒప్పుకుంటారు. కానీ వరుస సినిమాలతో సక్సెస్ లు అందుకోవడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ దీనిని కూడా చాలా సునాయాసంగా చేస్తూ ఇండస్ట్రీలో వరుస గా స్టార్ హీరోలందరికి సక్సెస్ లను అందిస్తూ వస్తున్న డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో మనం ఒకసారి తెలుసుకుందాం…

తెలుగు లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి…ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ లు సాధించాయి. ఈ లిస్ట్ లో ఈయన మొదటి స్థానం లో ఉంటాడు. ఇక ఈయన తర్వాత స్థానంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు. ఆయన చేసిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు మినహా ఇస్తే అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈయన ఎక్కువగా ఫ్యామిలీ ని , యూత్ ని ఆకట్టుకునేలా ఉండే సినిమాలను తీస్తాడు అలాంటి సినిమాల వల్లనే ఈయన సక్సెస్ లు అందుకుంటాడని చాలా మంది చెప్తూ ఉంటారు. గురూజీ ఏ హీరోని అయిన చాలా తెలివి గా డీల్ చేసి సక్సెస్ కొడతాడు అనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో భారీగా వినిపిస్తుంటాయి…

ఇక ఇంతకు ముందు అల్లు అర్జున్ తో చేసిన అలా వైకుంఠపురం లో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్… ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబుకి భారీ సక్సెస్ ని ఇవ్వనున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి…మరి గుంటూరు కారం సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

వీళ్ళ తర్వాత ప్లేస్ లో కొరటాల శివ ఉంటాడు. ఈయన చేసిన సినిమాల్లో ఆచార్య సినిమా తప్ప అన్ని సినిమాలు మంచి సక్సెస్ ని సాధించాయి…ఇక ఇప్పుడు దేవర తో మరో సక్సెస్ ని అందుకోవడానికి రెఢీ అవుతున్నాడు…ఇక వీళ్ళ తర్వాత స్థానం లో అనిల్ రావిపూడి ఉంటాడు ఈయన చేసిన సినిమాలు కూడా అన్ని మంచి విజయాలను అందుకున్నాయి…