
IPL 2023 Young Cricketers: ఐపీఎల్–2023లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. సీజన్ 16నో సీనియర్ల కన్నా.. జూనియర్ల ప్రదర్శనే ఆకట్టుకుంటోంది. గుజరాత్ చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తోనే కుర్రాళ్ల ప్రదర్శన వెలుగులోకి వచ్చింది. ఒక్కో జట్టులో ఒక్కో యువ ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టును గెలిపిస్తున్నాడు. రూ.20లక్షల బేస్ రేట్‌తోనే కొన్ని వీరంతా కూడా రూ.14 కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్ల కంటే మెరుగా ఆడుతున్నారు. కెరీర్‌ను మలుపు తిప్పుకుంటున్నారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడంతో ఐపీఎల్ 2023లో అదరగొట్టిన కుర్రాళ్లకు కచ్చితంగా టీమిండియాలో చాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాణించిన కుర్రాల గురించి తెలుసుకుందాం..
తిలక్ వర్మ (ముంబై )
తెలుగు క్రికెటర్ తిలక్‌వర్మ ముంబై తరఫున ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సీజన్‌లో వర్మ రెండు మ్యాచ్‌లు ఆడాడు. అతడి బ్యాట్ రెండు ఇన్నింగ్స్‌లలో 106.00 సగటుతో 106 పరుగులు చేశాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఎలాంటి ఒత్తిడి సమయంలోనైనా అవలీలగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.

సాయి సుదర్శన్ (గుజరాత్ )
గుజరాత్ తరఫున ఐపీఎల్ సీజన్ 16 ఆడుతున్న తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ ఆకట్టుకుంటున్నాడు. రెండో మ్యాచ్‌లోనూ ఆఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. గుజరాత్ వరుస విజయాల వెనుకున్నది ఇతడే. ఒత్తిడిలోనూ ఓర్పుగా ఆడుతూ తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచుల్లో 137 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 68.50. ఇదే జోరు కంటిన్యూ చేస్తే ధనాధన్ ఫార్మాట్‌లో టీమిండియా తరుఫున అరంగేట్రం చేసే అవకాశం రావడం ఖాయం.

వెంకటేశ్ అయ్యర్ (కోల్ కతా)
వెంకటేశ్ అయ్యర్ గత సీజన్‌లోలానే ఈ సీజన్‌లోనూ అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా దిగి ఆకట్టుకోగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులు చేసి కోల్‌కత్తా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రుతురాజ్ గైక్వాడ్(చెన్నై)
ఐపీఎల్ 2023లోనూ 26 ఏళ్ల ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. చెన్నై సూపర్‌కింగ్ జట్టు మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నాడు. మూడు మ్యాచులు ఆడిన రుతురాజ్ ఏకంగా 94.50 సగటుతో 189 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్‌గా ఉన్నాడు.

యశస్వి జైస్వాల్ (రాజస్థాన్)
యశస్వి జైస్వాల్ కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతడి బ్యాట్ నుంచి 41.67 సగటుతో 125 పరుగులు వచ్చాయి. ఈ పానీపూరి కుర్రాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

రింకూ సింగ్ (కోల్‌కతా)
ఐపీఎల్ 2023లో రింకూసింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ అతడిని ఓవర్‌నైట్ స్టార్‌ను చేశాయి. అలీఘర్లో జన్మించిన ఈ ఆల్ రౌండర్ 21 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసి గుజరాత్ చేతిలో ఓటమి ఖాయమనుకున్న కోల్‌కతా జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అసాధారణ విజయం వెనుక అతని తుపాన్ ఇన్నింగ్స్ ఉంది. రింకూ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు విజయం అందించాడు. 2018 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.80 లక్షలకు కొనుగోలు చేయడంతో రింకూ కష్టాలు తీరాయి. అతని ప్రారంభ అంచనా రూ.20 లక్షల బిడ్. కానీ కేకేఆర్ పోటీపడి బిడ్ పెంచి అతని కలలను నెరవేర్చింది.

పబిస్రిమన్‌సింగ్( పంజాబ్)
పంజాబ్ తరుపున ఓపెనర్‌గా దిగుతున్న పబిస్రిమన్ సింగ్ కూడా ఐపీఎల్ సీజన్ 16లో అదరగొడుతున్నాడు. ఓపెనర్‌గా ప్రత్యర్థుల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.