
Pawan Kalyan OG Release Date: ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం #OG..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 వ తారీఖున ముంబై లో ప్రారంభం కానుంది.తొలుత పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభిస్తారు,వచ్చే వారం లో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్టు సమాచారం.వచ్చే వారం లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోయ్యే షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్ సుజిత్.పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతుంది.మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయ్యే ఈ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది లోనే పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్ కళ్యాణ్.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.పాన్ ఇండియా సినిమా కావడం తో పవన్ కళ్యాణ్ కూడా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటాడట.ఇప్పటి వరకు తన కెరీర్ లో పవన్ కళ్యాణ్ ఎన్నడూ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం మనం ఎప్పుడూ చూడలేదు.

అప్పుడప్పుడు పలు సినిమాలకు డైరెక్టర్స్ ఎక్కువ ఒత్తిడి చెయ్యడం తో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కానీ, పూర్తి స్థాయి ప్రొమోషన్స్ లో మాత్రం పాల్గొనేందుకు ఇష్టపడేవాడు కాదు.కానీ #OG చిత్రం కి పాన్ ఇండియన్ రేంజ్ అప్పీల్ ఉంది, అందుకే ఇతర భాషల్లో ఈ చిత్రం విడుదల సమయానికి అక్కడి ప్రొమోషన్స్ లో పాల్గొంటాడట.ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను అతి తర్వలోనే తెలియచేయనున్నారు మూవీ టీం.