పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు. ఎందుకంటే ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో.. చివరి వరకు తెలియదు. ప్రాంతాలే కాకుండా దేశాలు, ఖండాంతరాలు దాటి ఒకరికొకరు బంధుత్వం కలుపుకుంటూ ఉంటారు. భారతదేశంలో నుంచి విదేశాలకు వెళ్లేవారు చాలా మందే ఉన్నారు. అలాగే విదేశీయులు ఇండియాలో సెటిలైనవారూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఇక్కడివారు విదేశీయులతో సంబంధాలు కలుపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది ప్రేమ వల్ల కావచ్చు.. లేదా కుటుంబాల మధ్య ఆప్యాయత కావచ్చు.. ఏదైమైనా మనవాళ్లు విదేశీయులతో బంధుత్వాలు కలుపుకోవడంతో పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఇక ప్రపంచ క్రీడల్లో క్రికెట్ ప్రధానమైంది. ఈ ఆటలో వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులను మైదానాల్లో చూడగలుగుతాం. కొందరి ఆటతీరు నచ్చి వారికి ఫ్యాన్ అయిపోతాం. అయితే కొందరు అభిమానులు వారికి ప్రేమికులుగా మారి పెళ్లిచేసుకున్న భారతీయ యువతులు ఉన్నారు. ఇక విదేశీయులతో ఎఫైర్లు పెట్టుకున్న భారతీయ మహిళలు, ప్రముఖులు ఉన్నారు. పాకిస్తానీలు కూడా భారతీయ మహిళలపై మనసు పారేసుకున్న వారు ఉన్నారు.కొందరు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరేమో ప్రేమ పేరిట సహజీవనం చేసుకున్నారు. ఇంకొందరు విడిపోయారు. ఇలా విభిన్న ప్రముఖుల పెళ్లిళ్లు, ఎఫైర్లపై స్పెషల్ స్టోరీ..

-ముత్తయ్య మురళీధరన్-మద్దిమలర్
శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అత్యంత విజయవంతమైన బౌలర్. అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఆయన 1347 వికెట్లు తీశాడు. 2011లో రిటైర్మెంట్ తీసుకున్న ఆయన భారతదేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2005లో మద్దిమలర్ రామ్మూర్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మద్దిమలర్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి. ఈ ఆసుపత్రి మాజీ చైర్మన్ దివంగత డాక్టర్ ఎస్. రామమూర్తి కుమార్తెనే మద్ది మలర్.

-హసన్ అలీ-సమీయా అర్జూ
భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం కొనసాగుతున్నా.. సంబంధాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. ఇక్కడి వారు అక్కడివారికి బంధువులు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ, ఇండియాకు చెందిన సమీయా అర్జూ వివాహం చేసుకున్నారు. ఇండియాకు చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అయిన సమీయా కుటుంబం ఫరీదాబాద్ లో ఉంది. వీరు 2019లో దుబాయ్ లో పెళ్లి చేసుకున్నారు. పేసర్ గా గుర్తింపు పొందిన హసన్ అలీ మైదానంలో ఆటతీరే కాకుండా నవ్వులతో అలరిస్తారడు. దీంతో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
-షాన్ టైట్- మషూమ్ సింఘా
2007ప్రపంచ కప్ క్రికెట్లో షాన్ టైట్ పేరు మారు మోగింది. ఈ సమయంలో ఆ దేశం టైటిల్ గెలుచుకోవడంలో షాన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ‘ది వైల్డ్ థింగ్’ అనే పేరు వచ్చింది. అత్యంత వేగంగా బౌలింగ్ వేయడంలో షాన్ దిట్ట. ఇక ఈయన ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ తరుపున గ్రౌండ్లోకి వచ్చాడు. ఈ సమయంలో ఇండియాకు చెందిన మోడల్ మషూమ్ సింఘాలను కలిశాడు. ఆ తరువాత వీరు 2013లో నిశ్చితార్థం చేసుకున్నారు. అలాగే షాన్ 2017లో భారతీయ పౌరసత్వాన్ని పొందాడు.
-గ్లెన్ మాక్స్ వెల్-వినిరామన్
క్రీడాభిమానులు ఎక్కువగా సంపాదించుకున్న క్రికెటర్లలో గ్లెన్ మాక్స్ వెల్ ఒకరు. ఐపీఎల్ క్రికెట్ లో రాయల్ చాలెంజర్స్ తరుపున ఆడిన ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ‘బిగ్ బాష్ లీగ్’ లో మెల్బోర్న్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సమయంలో మాక్స్ వెల్ భారత్ లోని తమిళ కుటుంబానికి చెందిన విని రామన్ తో 2020లో నిశ్చితార్థం అయింది. ఇటీవల వీరి వివాహం కాగా వారికి సంబంధించిన ఫొటోలను నెట్టంట్లో ఉంచడంతో అవి వైరల్ గా మారాయి.
-షోయబ్ మాలిక్-సానియా మీర్జా
పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్-భారత టెన్నిస్ స్టార్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి క్రీడలు వేరే అయినా రంగం ఒక్కటే. ఈ క్రమంలో వీరి మనసులు కలిసి ఆ తరువాత పెద్దలను ఒఫ్పించి 2010లో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో వివాహం చేసుకున్న తరువాత దుబాయ్ లో స్థిర పడ్డారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు.
-భారతీయ మహిళలతో ఎఫైర్ పెట్టుకున్న ప్రముఖులు వీరే..
-ఇక మన భారతీయ మహిళలతో పెళ్లి చేసుకోకుండా కొంతమంది ప్రముఖులు ఎఫైర్లు పెట్టుకున్నవారు ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ రీనా రాయ్ 80వ దశకంలోనే అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో శత్రుజ్ఞ సిన్హాతో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వచ్చాయి. అప్పటి పాకిస్తాన్ క్రికెటర్ మోహసీన్ ఖాన్ కు విడాకులు ఇచ్చి మరీ శత్రుజ్ఞతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్టు ప్రచారం సాగింది..
-హుమైమా మాలిక్ – ఈమె ‘రాజా నట్వర్‌లాల్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
– హుమైమా మాలిక్‌తో విడిపోయిన తర్వాత వసీం అక్రమ్ బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి కానీ ఇద్దరూ దానిని ఖండించారు.
-అష్మిత్ పటేల్ – రియాలిటీ టీవీ షో ‘బిగ్ బాస్’లో పాకిస్థానీ నటి వీణా మాలిక్‌తో ఉన్న సంబంధం బయటపెట్టాడు. కానీ ఒక సంవత్సరం తరువాత వారు విడిపోయారు.
-నిగర్ ఖాన్ – గత సంవత్సరం తన చిరకాల ప్రియుడు ఖయ్యామ్ షేక్‌తో వివాహం చేసుకుని, ఇప్పుడు దుబాయ్‌లో స్థిరపడ్డారు.
-రీనా రాయ్ – 70వ దశకంలో ప్రముఖ బాలీవుడ్ నటి పాకిస్థానీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.
-సోనాలి బింద్రే – ఒకసారి ఒక ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ తనకు సోనాలిబింద్రే చాలా ఇష్టమని.. తన లవ్ ప్రతిపాదనను తిరస్కరించినట్లయితే, ఆమెను కిడ్నాప్ చేస్తానని సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పటికీ వారి పుకార్ల సంబంధం గుట్టూ వీడలేదు.
-జీనత్ అమన్ – బాలీవుడ్ నటి పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే వారి సంబంధం ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో వారు విడిపోయారు.