Kodi Ramakrishna: రాజమౌళి ని మించిన తెలుగు దర్శకుడు ఒకరు ఉన్నారు..ఆయన ఎవరో తెలుసా..?

రాజమౌళి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ గ్రాఫిక్స్ తో వండర్స్ చేస్తున్నాడు అని అంటున్నారు, కానీ రాజమౌళికి ముందే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే గ్రాఫిక్స్ తో వండర్స్ సృష్టించిన తెలుగు దర్శకుడు ఒకరు ఉన్నారు.

Written By: Gopi, Updated On : January 24, 2024 9:46 am
Follow us on

Kodi Ramakrishna: ఒక సినిమాని స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అంటే అది ఒక దర్శకుడి విజన్ ప్రకారమే తెరకెక్కుతుంది. డైరెక్టర్ కలగన్న ఒక పాయింట్ మీద కొన్ని వందల మంది పని చేస్తూ దాన్ని సినిమాగా తెరకెక్కించి సక్సెస్ కొడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులు అందరూ కూడా వాళ్ళు తీసే సినిమాలను గ్రాఫిక్స్ ప్రధానం గా చేసుకొని తీస్తున్నారు.

వాళ్ల కల కి గ్రాఫిక్స్ ని ఆడ్ చేసి ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తూ మంచి విజయాన్ని అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఫాలో అవుతూ ప్రతి మేకర్ కూడా తనదైన రీతిలో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు అందరూ రాజమౌళి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ గ్రాఫిక్స్ తో వండర్స్ చేస్తున్నాడు అని అంటున్నారు, కానీ రాజమౌళికి ముందే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే గ్రాఫిక్స్ తో వండర్స్ సృష్టించిన తెలుగు దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆయనే ‘ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అయిన కోడి రామకృష్ణ’… ఈ జనరేషన్ లో ఉన్న చాలామందికి ఆయన తెలీదు. కానీ ఆయన 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఆయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కినవే కావడం విశేషం…ఇక ఈయన అమ్మోరు సినిమాతో మొదటిసారిగా గ్రాఫిక్స్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక ఆ తర్వాత దేవి సినిమాతో మరొక సారి తన గ్రాఫిక్స్ మాయాజాలం లోకి ప్రేక్షకులను ఆహ్వానించాడు. అలాగే అంజి, దేవి పుత్రుడు, అరుంధతి లాంటి చాలా సినిమాలతో తన పొటెన్షియాలిటీ ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చూపించాడు. అయితే ఆయన సినిమాలు తీసినప్పుడు పాన్ ఇండియా స్థాయి లో సినిమాలను రిలీజ్ చేయలేదు, కాబట్టి తన ప్రతిభ కేవలం తెలుగు ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అయింది.

అందుకే ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందలేక పోయాడు. కానీ ఆయన మాత్రం అసాధారణమైన ప్రతిభ ఉన్న వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపబడ్డాడు. ఇప్పటికి కూడా ఆయన సినిమాలు చూస్తుంటే కొన్ని సీన్లలో అయితే గ్రాఫిక్స్ సీన్ ఏదో, ఒరిజినల్ సీన్ ఏదో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో గ్రాఫిక్స్ ని ఆ టైమ్ లోనే వాడుకున్నాడు అంటే ఆయన టాలెంట్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు…