https://oktelugu.com/

Serial actress : సీరియల్స్ లో సాంప్రదాయని, రియల్ లైఫ్ లో మాత్రం అలా… కార్తీక దీపం సీరియల్ నటిని ఇలా చూస్తే మీ మతిపోవడం ఖాయం

దివ్య అంబటి కార్తీక దీపం పార్ట్ 1లో నటించింది. విలన్ మోనిత ఇంట్లో పని మనిషి అయిన ప్రియమణి పాత్రలో మెరిసింది. ఇక మోనిత పాత్ర శోభ శెట్టి చేసిన సంగతి తెలిసిందే. శోభా శెట్టి-ప్రియమణి సీన్స్ కామెడీ తో పాటు ఆసక్తి రేపుతూ ఉంటాయి. కార్తీక్-దీపల మీద తాను చేయబోయే కుట్రల గురించి మోనిత ప్రియమణితో చెబుతూ ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ బ్లాక్ బస్టర్ కావడంతో అంబటి దివ్య కూడా పాప్యులర్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 17, 2024 / 08:29 PM IST
    Follow us on

    Serial actress : సీరియల్ నటులు చేసే పాత్రలకు బయట వారి లైఫ్ స్టైల్ కి సంబంధమే ఉండటం లేదు. బుల్లితెర పై సాంప్రదాయ దుస్తులు ధరించి, హోమ్లీ రోల్స్ చేస్తున్న నటులను, నిజ జీవితంలో కూడా అలానే ఊహించుకుంటున్నారు ఆడియన్స్. అందుకు భిన్నంగా వారు గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతిరాయ్ తీరుకు తెలుగు ఆడియన్స్ అవాక్కు అయ్యారు. స్టార్ మా లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సక్సెస్ఫుల్ సీరియల్. రిషి-వసుధారల రొమాంటిక్ సీన్స్ ఆ సీరియల్ కి హైలెట్.

    అలాగే మదర్ సెంటిమెంట్ ని కూడా దర్శకుడు గుప్పెడంత మనసు సీరియల్ లో కూర్చాడు. రిషి తల్లి జగతి పాత్రను జ్యోతిరాయ్ చేసింది. నిండైన చీరకట్టులో మిడిల్ ఏజ్ ఉమన్ గా ఆమె మెప్పించారు. తన నటనతో ఎమోషన్స్ పండించారు. కట్ చేస్తే జ్యోతిరాయ్ హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అసలు గుప్పెడంత మనసు జగతి ఈమేనా? అని అవాక్కు అయ్యారు.

    నా వయసు ముప్పై ఏళ్ళే. జగతి పాత్రలో చూసి నన్ను మీరు అలానే ఊహించుకుంటున్నారు. కన్నడ టీవీ షోలలో నేను గ్లామరస్ గా కనిపించానని జ్యోతిరాయ్ వివరణ ఇచ్చింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న జ్యోతి రాయ్ భర్తకు విడాకులు ఇచ్చింది. వీరికి ఒక కొడుకు సంతానం. పూర్వజ్ అనే దర్శకుడుని రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం.

    బ్రహ్మముడి సీరియల్ లో ఇంద్రాణి పాత్ర చేస్తున్న షర్మిత గౌడ కూడా ఇంతే. ఆమె ఇంస్టాగ్రామ్ లో బికినీ ఫోటోలు, హాట్ వీడియోలు షేర్ చేస్తుంది. బ్రహ్మముడి సీరియల్ లో ఇంద్రాణి నెగిటివ్ రోల్ చేస్తుంది. ఆమెది కూడా తల్లి పాత్రే. కార్తీక దీపం లో నటించిన తెలుగు నటి అంబటి దివ్య సైతం సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది.

    దివ్య అంబటి కార్తీక దీపం పార్ట్ 1లో నటించింది. విలన్ మోనిత ఇంట్లో పని మనిషి అయిన ప్రియమణి పాత్రలో మెరిసింది. ఇక మోనిత పాత్ర శోభ శెట్టి చేసిన సంగతి తెలిసిందే. శోభా శెట్టి-ప్రియమణి సీన్స్ కామెడీ తో పాటు ఆసక్తి రేపుతూ ఉంటాయి. కార్తీక్-దీపల మీద తాను చేయబోయే కుట్రల గురించి మోనిత ప్రియమణితో చెబుతూ ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ బ్లాక్ బస్టర్ కావడంతో అంబటి దివ్య కూడా పాప్యులర్ అయ్యింది.

    కార్తీకదీపంలో పనిమనిషిగా దివ్య అంబటి చీర కట్టులో కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ భామగా అవతరించింది. తరచుగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది. అలాగే ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ని మైంటైన్ చేస్తుంది. బుల్లితెర సెలెబ్స్ ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోలు షేర్ చేయడానికి పెద్ద కారణమే ఉంది.

    ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ప్రముఖ ఆదాయమార్గంగా మారింది. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సెలెబ్స్ ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆర్జించవచ్చు. కొందరు సెలెబ్స్ అయితే.. విలువలు వదిలేసి బెట్టింగ్, గేమ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ యాప్స్ లో జూదం ఆడి యువత లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ లభిస్తుంది. అదన్నమాట సంగతి. మరి అంబటి దివ్య గ్లామరస్ ఫోటోల మీద మీరు కూడా ఓ లుక్ వేయండి