Prithviraj Sukumaran: ఆ ఒక్క సీన్ లో ప్రభాస్ ని చూస్తే మాత్రం ఫ్యాన్స్ కి ఇక పునకాలే అంటున్న పృథ్వి రాజ్ సుకుమారన్…

కాబట్టి ప్రతి ప్రేక్షకులు కూడా ప్రభాస్ ని చూసినప్పుడు తనని తాను ప్రభాస్ లాగా ఊహించుకుంటాడు కాబట్టి ప్రభాస్ అంటే క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతి సెంటర్ లో కూడా రక్తాలు చిందించే అభిమానులు ఉన్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By: Gopi, Updated On : December 21, 2023 6:52 pm

Prithviraj Sukumaran

Follow us on

Prithviraj Sukumaran: ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో ఈనెల 22వ తేదీన సలార్ సినిమా రూపంలో థియేటర్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్లు హార్ట్ కేక్ లాగా అమ్ముడు.ఇక ఇప్పటికే బుక్ మై షో లో పెట్టిన ఈ టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి బుక్ మై షో కూడా కొద్దిసేపటి వరకు హ్యాంగ్ అయిపోయింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు సలార్ మూవీ ఫీవర్ జనాల్లో ఏ విధంగా ఉందో అందుకే ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో నుంచి సినిమా వస్తుంది అంటే సగటు ప్రేక్షకుడు కూడా ఆ సినిమా మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ చూస్తేనే ఆయన ఒక హీరో అనిపించే రేంజ్ లో ఉంటాడు.

కాబట్టి ప్రతి ప్రేక్షకులు కూడా ప్రభాస్ ని చూసినప్పుడు తనని తాను ప్రభాస్ లాగా ఊహించుకుంటాడు కాబట్టి ప్రభాస్ అంటే క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతి సెంటర్ లో కూడా రక్తాలు చిందించే అభిమానులు ఉన్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ తో పాటు ఆ చిత్ర యూనిట్ మొత్తం బిజీబిజీగా తిరుగుతున్నారు. ఇంకా కొన్ని గంటల్లో థియేటర్లోకి రానున్న ఈ సినిమా మీదనే ప్రభాస్ గాని,డైరెక్టర్ ప్రశాంత్ గాని, ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య క్యారెక్టర్ ను పోషించిన పృథ్వి రాజ్ సుకుమారన్ లాంటి నటుడు చెప్పడం తో ఈ సినిమా మీద అభిమానులు మంచి అంచనాలను పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న పృథ్వి రాజ్ సుకుమారన్ మాత్రం ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్ ఇచ్చెట్టు గా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడు. కొన్ని సీన్లలో అయితే ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా ప్రభాస్ ఫైటింగ్ సీన్స్ చూస్తే ఒక్కొక్కరికి రోమాలు నిక్కబడుచుకుంటాయంటూ తను చేసిన కామెంట్లు ప్రస్తుతం ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా పట్ల అంచనాలను మరింత పెంచుతున్నాయి…

పృథ్వి రాజ్ సుకుమారన్ మాట్లాడిన ఈ మాటలకి ప్రభాస్ అభిమానులు 22వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ షో ని మొదటిరోజు చూసే ప్రేక్షకులకు మాత్రం అద్భుతమైన ఫీల్ కలగబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది…ఇక ఈ సినిమా తో ప్రభాస్ మార్కెట్ మరోసారి పెరగబోతున్నట్టు గా తెలుస్తుంది…