Homeజాతీయ వార్తలుCI Nageswara Rao Case: తెలంగాణ ఖాకీ వనంలో ఎందరో నాగేశ్వరరావులు

CI Nageswara Rao Case: తెలంగాణ ఖాకీ వనంలో ఎందరో నాగేశ్వరరావులు

CI Nageswara Rao Case: ఫ్రెండ్లీ పోలీసింగ్, దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోలింగ్ వ్యవస్థ, వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఇన్నోవాలు, షీ టీమ్ లు… ఇన్నీ చేసినా సామాన్యుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కే అవకాశం లేదు. ఒకవేళ ఫిర్యాదు చేసినా నిందితుల భార్యల శీలానికి రక్షణ లేదు. ఏ క్షణం ఏ సీఐ వాహనం వచ్చి ఇంటిముందు ఆగుతుందో.. ఏ ఎస్ఐ అర్ధరాత్రి ఇంటికి వచ్చి విచారణ చేస్తాడో.. ఏ ఎస్ఐ శిక్షణలో ఉన్న తోటి మహిళా ఎస్సై పై కన్నేస్తాడో.. తనిఖీల పేరుతో అర్ధరాత్రి పూట అఘాయిత్యానికి పాల్పడతాడో.. ఇలా ప్రతీ క్షణం భయమే. ఒకరా ఇద్దరా.. కొందరు మినహా అందరూ దుశ్శాసనుడి వారసులే. గులాబీ పోస్టింగ్ పొందాక అనధికార టీఆర్ఎస్ కార్యకర్తలే. మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సీసీఎస్ ఎస్ఐ విజయ్.. కేవలం బయటకు వచ్చిన పేర్లు మాత్రమే. బయటకు రానివి, డిపార్ట్మెంట్ లో లోపల పంచాయితీ చేసినవి కోకొల్లలు. అసలు ఇప్పుడు తెలంగాణలో పోలీసులు అంటే టీఆర్ఎస్ పార్టీకి అధికారిక సెక్యూరిటీగా వ్యవస్థగా మారిపోయింది. కాంగ్రెస్ హయాంలో మొదలైన ఈ పోస్టింగ్ ల వ్యవహారం.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పుంతలు తొక్కుతోంది. అసలు ఒక ఎమ్మెల్యే సిఫారసు లేకుండా ఓ మండలానికి ఎస్ఐని నియమించే అధికారం డిపార్ట్మెంట్ కు లేదు. అంతెందుకు సాక్షాత్తూ ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారిని తెలంగాణలో పని చేయిస్తున్నారంటే పోలీసు వ్యవస్థ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ముద్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

CI Nageswara Rao Case
CI Nageswara Rao

-నమ్మకం లేదు
తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది తమ పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తే వ్యవస్థగా మార్చిందని తర్వాత అర్థమైంది. అధికార పార్టీ నాయకుల సిఫారసు లేకుండా పోలీసులకు పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి డిపార్ట్మెంట్లో కరువవడం తెలంగాణలో పతనమవుతున్న విలువలకు ప్రబల నిదర్శనం. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రభుత్వం అపరిమిత అధికారాలు ఇవ్వటం, పోస్టింగ్ తెచ్చుకునేటప్పుడు అధికార పార్టీ నాయకులకు పోలీసులు లంచాలు ఇవ్వటం వల్ల వ్యవస్థ పూర్తిగా కట్టు తప్పిపోయిందన్న విమర్శ ఉంది. ఇసుక క్వారీలు, గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో పోస్టింగుల కోసం లక్షల్లో బేరసారాలు జరుగుతున్నాయంటే పోలీసు వ్యవస్థ ఎంత కమర్షియల్ గా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ బాస్ నుంచి ఒక మారుమూల మండల ఎస్సై వరకు అందరు కూడా అధికార పార్టీ ముద్ర ఉన్నవాళ్లేనన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థను తప్పు బట్టి, విధానాలను ఎండగట్టే పోలీసులను మాత్రం వేకెన్సీ రిజర్వులో ఉంచుతున్నారు. ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న పోలీసులు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు. తమ అడుగులకు మడుగులు ఒత్తే వారికి మాత్రం ఉన్న పోస్టింగ్లతో పాటు అదనంగా బాధ్యతలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Also Read: India’s population : చైనాను దాటేయనున్న భారత్ జనాభా?

అందరూ ‘నాగేశ్వరరావు’లే
తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టులకు సహకరిస్తున్నారని అభియోగంతో ఇద్దరు యువతీ యువకులను కాల్చి చంపిన ఉదంతం నుంచి మారేడుపల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు దాష్టీకం వరకు పోలీస్ శాఖ అడుగడుగునా ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది. మహిళ కానిస్టేబుల్ పై కన్నేసే ఎస్సైలు, మహిళా ఎస్సైలను వేధించే సిఐలు, సీఐలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే మహిళ ఏఎస్పీలు, సీఐతో పడక పంచుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మహిళా ఎస్ఐలు.. ఎంతోమంది పోలీస్ శాఖ పరువును బజారుకు ఈడ్చారు. అప్పట్లో మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ రూరల్ ఎస్సైగా పనిచేసిన రాజ్యలక్ష్మి ఓ సీఐతో వివాహేతర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని మీడియాలో కథనాలు వచ్చాయి.. అవినీతి నిరోధక శాఖ ఏసీపీగా పని చేస్తున్న సునీత రెడ్డి ఒక సీఐతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు అడ్డంగా దొరికిపోయింది. అప్పట్లో కోదాడ రూరల్ ఎస్సైగా పనిచేసిన రామాంజనేయులు తోటి కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె భర్తకు అడ్డంగా బుక్కయ్యాడు. మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఓ మహిళా ఎస్ఐ పై అత్యాచారం చేశాడు. పినపాక సీఐ రమేష్ ఓ విలేఖరి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె భర్త పై లేనిపోని కేసులు బనాయించాడు. సదరు సీఐ నిర్వాకం వల్ల ఆ భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన ఘటనలు మాత్రమే.

CI Nageswara Rao Case
CI Nageswara Rao Case

ఇవే కాకుండా అక్రమ వ్యవహారాల్లో వేలు పెట్టి కోట్లు గడించిన పోలీసులు ఎంతో మంది .. ఇక మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు 200 కోట్ల వరకు ఆస్తులు కూడపెట్టారని పోలీస్ శాఖ వర్గాలే చెబుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ పబ్ ఘటనలో అక్కడి ఎస్ఐ అంజలితో కలిసి నిందితులపై కేసులు నమోదు చేశారు. పేరు ఉన్న వ్యక్తులు కావడంతో భారీగానే ముట్ట చెప్పారన్న ఆరోపణలున్నాయి.. మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ వేలు పెట్టిన ప్రతి దాంట్లోనూ భారీగానే లాగేవాడనే ఆరోపణలున్నాయి. తాజాగా ఓ మహిళపై వేధింపుల కేసులో తీవ్ర అభయోగాలు ఎదుర్కొంటున్న నాగేశ్వరరావుని కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తూ ఉండడం అతడికి ఉన్న పరపతిని తెలియజేస్తోంది

మహిళల పై వేధింపులు
బయటే కాదు పోలీస్ స్టేషన్లోనూ మహిళలకు రక్షణ లేదన్న ఆరోపణలున్నాయి.. మారేడ్పల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ కేసులో తన భర్త నిందితుడుగా ఉండటంతో ఓ వివాహిత పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడి నుంచి ఆమెపై నాగేశ్వరరావు వేధింపులు మొదలయ్యాయి. ఏకంగా ఆమె భర్తను తన ఫామ్ హౌస్ లో పనికి పెట్టుకున్న ఇన్స్పెక్టర్.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి ఆమె పై ఆఘాయిత్యానికి పాల్పడే వాడు. ఒకరోజు తన ఇంటికి రావడంతో అదే సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త ఇన్స్పెక్టర్ పై దాడి చేశాడు. ఇలా సదరు ఇన్ స్పెక్టర్ లీలలు బయటకు వచ్చాయి. నాగేశ్వర రావు లాంటి సీఐలు, విజయ్ కుమార్ లాంటి ఎస్ఐలు ఎంతోమంది ఉన్నారు. వీరి వల్ల స్టేషన్ కి వచ్చే మహిళలకు భద్రత లేకుండా పోతోంది. పోలీస్ శాఖ ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయి. భూ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, గుట్కా దందా, రేషన్ బియ్యం దందా.. ఇలా కనిపించే ప్రతి అక్రమ వ్యాపారం లోను పోలీసులు తమ వాటా తాము తీసుకుంటున్నారు. ఫలితంగానే అక్రమార్కులు పేట్రేగి పోతున్నారు. ఇదే సమయంలో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇంతటి వైఫల్యాలు కనిపిస్తున్నా పోలీస్ శాఖను వీసమెత్తు మాటనని సీఎం కేసీఆర్ ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు నిజంగానే ఆశ్చర్యమేస్తుంది.

Also Read:Covert Leader: ఏపీలో ఓ పార్టీ..ఢిల్లీలో మరో పార్టీ.. వైసీపీ, టీడీపీల్లో కోవర్ట్ నేత!?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular