China Companies Tax Evasion in India: చైనా పాలకులే కాదు. ఆ దేశ కంపెనీలు కూడా పరాన్న జీవులే. “ట్రస్ట్ నో వన్.. కిల్ ఎనీ వన్.. బీ ఓన్లీ వన్”.. ఇదే చైనా కంపెనీల అంత: సూత్రం. మొన్నటికి మొన్న ఐపీఎల్ సీజన్లలో భారతదేశ జట్టుకు ఫ్రాంచైజీ గా వివో ఇండియా వ్యవహరించింది. ఇందుకు ₹వేల కోట్లు ఖర్చు పెట్టింది. అప్పట్లో ఈ డీల్ సాకర్ ను మించి పోయిందనే విమర్శలు ఉన్నాయి. చైనా కంపెనీ ఈ స్థాయిలో ఎందుకు పెట్టుబడి పెట్టిందో అర్థం కాని మన దేశీయులకు.. ఆ తర్వాత వీవో ఇండియా పెంచుకున్న అమ్మకాలు చూస్తే కానీ అసలు సినిమా అవగతం కాలేదు.
మార్కెట్ లో ఎదిగేందుకు డబ్బులు వెదజల్లే చైనా కంపెనీలు.. తర్వాత అంతకంటే ఎక్కువ లాక్కుంటాయి. సేమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బుద్దిని ప్రదర్శిస్తాయి. అవసరమైతే హనీ ట్రాపింగ్ కు కూడా వెనుకాడవు. వివో ఇండియా ఏటా చైనాలో అందాల పోటీలు నిర్వహిస్తుంది. అందులో టాప్ టెన్ లో ఉన్న యువతులను హనీ ట్రాపింగ్ కు వాడుతుంది. ఇక చైనా కంపెనీలు ఎలా సంపాదిస్తాయో.. ఆ సంపాదించిన దాన్నంతా తమ దేశానికి తరలిస్తాయి. ఇందులో చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారం నిర్వహించిన దేశంలో పన్నులు ఎగ్గొట్టేందుకు నష్టాలను చూపిస్తుంటాయి. వేలకోట్ల సొమ్మును దర్జాగా తమ దేశంలోకి దర్జాగా తరలిస్తాయి. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం చాయలతో అల్లాడుతుంటే చైనా మాత్రం కులాసాగా ఉంది. ఇందుకు కారణం ఇతర దేశాల సొమ్ము దోచుకోవడమే, దోచుకున్న సొమ్మును అదే దేశాల్లో పెట్టుబడిగా పెట్టటమే.. ఓ శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ దేశాలు మాత్రమే వేరు. చైనా తాకిడికి నిలువునా మోకరిల్లుతున్న తీరు మాత్రం ఒక్కటే. అంతెందుకు నేటికి మన దేశానికి ఎలక్ట్రిక్ పరికరాలు, ముడి ఔషధ సరుకులు చైనా నుంచి రావాల్సిందే. ప్రస్తుతం మనదేశంలో తయారీ రంగం ఇప్పుడిప్పుడే కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. అక్కసుతో చైనా ఆ సరుకులు మన దేశానికి ఎగుమతి చేయకుండా ఉండే అవకాశం లేకపోలేదు. తమ దేశీయ సంస్థలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో చైనా అధికారిక పత్రికలో భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశ దర్యాప్తు సంస్థల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు ప్రచురిస్తున్న తీరు విస్మయాన్ని కలగజేస్తోంది.
Also Read: CI Nageswara Rao Case: తెలంగాణ ఖాకీ వనంలో ఎందరో నాగేశ్వరరావులు
డొల్ల బుద్ధులు
వివో ఇండియా, హువే, షామీ వంటి కంపెనీలకు భారత్ మొబైల్ మార్కెట్లో గట్టి పట్టు ఉంది. ఒక్క వివో ఇండియా సంస్థనే మన దేశంలో ఇప్పటివరకు ₹1,25,185 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 2017 నుంచి 2021 వరకు ఏకంగా 62,476 కోట్లను గుట్టు చప్పుడు కాకుండా చైనాకు తరలించింది. వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయని భారత ప్రభుత్వానికి తెలియజేసింది. వివో ఇండియా మాదిరే హువే ఇండియా అనే కంపెనీ కూడా తన మాతృ సంస్థకు అక్రమంగా ₹750 కోట్ల మొత్తాన్ని మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాలుగా హువే ఇండియా ప్రకటించిన ఆదాయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. భారతదేశంలో హువే ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతుండగా.. చైనాలోని తన మాతృ సంస్థకు మాత్రం అక్రమంగా ₹750 కోట్ల డివిడెండ్ చెల్లించింది. మరోవైపు షామీ అనే కంపెనీ కూడా ₹5000 కోట్ల వరకు అక్రమంగా చైనాలోని తన మాతృ సంస్థకు తరలించింది.
భారత కంపెనీలు మూతపడ్డాయి
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో చైనా కంపెనీలదే హవా. డ్రాగన్ తాకిడికి దేశ కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్ కాన్ వంటి కంపెనీలు మార్కెట్ నుంచే తప్పుకున్నాయి. ప్రస్తుతం భారతదేశ మొబైల్ ఫోన్ మార్కెట్లో 60% వాటా చైనా కంపెనీలదే. అవి సెల్ ఫోన్ అమ్మకాల ద్వారా ఏటా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. అయితే వాటిని లెక్కల్లో సరిగా చూపించడం లేదు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి గుట్టుగా పెద్ద మొత్తాన్ని మాతృదేశానికి తరలించి నష్టాలు చూపించి పన్నులు ఎగవేస్తున్నాయి. అయితే ఆయా కంపెనీల ఆదాయాల్లో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో అనుమానం వచ్చిన ఈడి దర్యాప్తు ప్రారంభించింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. ఆ కంపెనీల ఖాతాలను పరిశీలిస్తే లావాదేవీలు మొత్తం చైనా మాతృ సంస్థలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా ఇక్కడ నష్టాలు చూపి అక్కడి కంపెనీలకు భారీగా డివిడెంట్లు చెల్లిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జీఎస్టీ లో లోపాలు
మరోవైపు జీఎస్టీ చట్టంలోని లోపాలు చైనా కంపెనీలకు వరంగా మారాయి. కొంతమంది చార్టెడ్ అకౌంట్ ల సహకారంతో చైనీయులు ఇప్పటికే మనదేశంలో కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీల ద్వారా వస్తు, సేవలు సరఫరా చేయకుండానే మాయ చేస్తున్నారు. దేశంలోని కొన్ని చైనా కంపెనీలకు దొంగ ఇన్ వాయిస్ లు జారీ చేసి ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్(ఐసీటీ) కొట్టేస్తున్నాయి. దీనివల్ల వచ్చే రాయితీలను దర్జాగా వెనకేసుకుంటున్నాయి. అంతేనా తమ కంపెనీల ద్వారా వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నాయి. దానిని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం లేదు. జమ చేయని సొమ్మే ₹వేల కోట్లల్లో ఉంటుందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వివో ఇండియా సంస్థ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నప్పుడు భారత్ లోని చైనా రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. తమ దేశ సంస్థలకు సంబంధించి భారత్ చేస్తున్న దర్యాప్తు న్యాయంగా జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. చైనా కంపెనీలు అవక తవకలకు పాల్పడితే ఆ దేశ రాయబార కార్యాలయం తెరపైకి రావటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాగా మన దేశంలో చైనా కంపెనీలు ఎప్పటినుంచో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అవి విక్రయించే సెల్ ఫోన్ ల ద్వారా మన దేశ పౌరుల సమాచారం చైనాకు చేరవేరుస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈడీ వర్గాలు ఇంకా లోతుగా తవ్వితే డ్రాగన్ కంపెనీల అసలు రూపం బయటపడుతుంది.
Also Read:India’s population : చైనాను దాటేయనున్న భారత్ జనాభా?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: China companies tax evasion in india vivo sent rs 62476cr worth turnover to china to avoid getting taxed in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com