Bro First Review: కమ్ బ్యాక్ అనంతరం పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో చిత్రం బ్రో. చెప్పాలంటే మెగా హీరోల మల్టీస్టారర్. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు. బ్రో చిత్ర కథ సాయి ధరమ్ తేజ్ పాత్ర కేంద్రంగా సాగుతుంది. జులై 28న బ్రో మూవీ విడుదల కానుంది. అయితే టాలీవుడ్ ప్రముఖులు బ్రో చిత్రాన్ని వీక్షించారు. దీంతో టాక్ బయటకు వచ్చింది. మరి బ్రో చిత్ర ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం…
కథ:
మార్కండేయ అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) యంగ్ ఎంట్రప్రెన్యూర్. తండ్రి మరణంతో బిజినెస్ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో పర్సనల్ లైఫ్ మిస్ అవుతాడు. క్షణం తీరిక లేకుండా బిజినెస్ కోసం పని చేస్తాడు. కుటుంబాన్ని, ప్రియురాలిని, స్నేహితులను పక్కన పెట్టేస్తాడు. అనుకోకుండా ప్రమాదానికి గురైన మార్క్ కన్నుమూస్తాడు. అప్పుడు గాడ్ ఆఫ్ టైం(పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇస్తాడు. నెరవేర్చవలసిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. మార్క్ మాత్రం చనిపోతాడు. అప్పుడు టైం గాడ్ ఏం చేశాడు? టైం గాడ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక మార్క్ జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటీ?
విశ్లేషణ:
అందుతున్న సమాచారం ప్రకారం బ్రో మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కామెడీ సన్నివేశాలతో ఎంటర్టైనింగ్ సాగుతుంది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ట్రీట్. పవన్ కళ్యాణ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. సాయి ధరమ్ పాత్రపై పవన్ కళ్యాణ్ వేసే సెటైర్స్ కామెడీతో పాటు ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయట.
క్లైమాక్స్ కి అరగంట ముందు నుండి ప్రేక్షకుడి మూడ్ మారిపోతుంది. ఒక్కసారిగా మూవీ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు కామెడీ, రొమాన్స్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఎమోషనల్ గా మారిపోతారు. చెప్పాలంటే పతాక సన్నివేశాలు ఏడిపించేస్తాయి. అంత బలమైన ఎమోషనల్ డైలాగ్స్, సీన్స్ తో కూడిన క్లైమాక్స్ ఉంటుందట.
మనిషి జీవితం కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడుస్తుంది. కాబట్టి జరగాల్సింది నువ్వు ఏం చేసినా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో చేయగా, సాయి ధరమ్ తేజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారని అంటున్నారు. హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా నిడివి లేదని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్, బీజీఎమ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మొత్తంగా బ్రో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అలరించే చిత్రం అంటున్నారు. బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు కాగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.