Myanmar : మయన్మార్ లో పట్టు కోల్పోతున్న మిలటరీ, అరాచకం దిశగా దేశం?

ఇప్పుడు మయన్మార్ లో అదే మిలటరీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మయన్మార్ లో పట్టు కోల్పోతున్న మిలిటరీ, అరాచకం దిశగా సాగుతున్న ఆ దేశంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 18, 2024 7:31 pm

Myanmar : మన పొరుగుదేశం మయన్మార్ (బర్మా) లో అల్లకల్లోల పరిస్థితులున్నాయి. అరాచక దిశగా సాగుతోందన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం.. నేపాల్, బంగ్లాదేశ్ గురించి చర్చించే మనం.. మనకు 5 రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న బర్మా గురించి మాత్రం పట్టించుకోం.

మిజోరం, మణిపూర్ నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో మయన్మార్ దేశానికి సరిహద్దు ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతుందన్నది మనకు ఇప్పటికీ తెలియదు. నిజానికి మయన్మార్ దేశం ఒకప్పుడు భారత్ దేశంలో అంతర్భాగంగా ఉండేది. బ్రిటీష్ ఇండియాలో 1937 వరకూ మన భారత్ లో మయన్మార్ భాగంగా ఉండేది. అటువంటిది 1948 జనవరి 1వ తేదీన వారికి స్వాతంత్ర్యం వచ్చింది.

అప్పటి బర్మాలో 1945 మొదటి ప్రపంచ యుద్ధం నాటికి 15 శాతం భారతీయులు ఉండేవారు. అందులో కూడా తమిళులు, తెలుగువాళ్లు ఎక్కువగా ఉండేవారు. 1947 ఆగస్టు దేశ విభజన సమయంలో లక్షలాది మంది చనిపోయారు. ఇక అంతకుముందే 1945లో మొదటి ప్రపంచ యుద్ధంలో అక్కడి నుంచి వచ్చి చనిపోయిన భారతీయులు ఎందరో ఉన్నారు. 1962లో బర్మాలో మిలటరీ ప్రభుత్వం భారతీయులను తరిమేస్తే బర్మా కాంధీశీకులు పొట్టచేతపట్టుకొని భారత్ కు తరలివచ్చారు.

ఇప్పుడు మయన్మార్ లో అదే మిలటరీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మయన్మార్ లో పట్టు కోల్పోతున్న మిలిటరీ, అరాచకం దిశగా సాగుతున్న ఆ దేశంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.