Hyundai car : అసలే ధర తక్కువ.. అందులోనూ రూ.1.24 లక్షల ట్యాక్స్ మినహాయింపు.. హ్యుందాయ్ కారు కోసం త్వరపడండి

ఐ 20 మొత్తం 8 వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ను దేశంలోని సైనికుల కోసం అందుబాటులో ఉంచింది. అయితే కొనుగోలుదారులు సీఎస్ డీ నుంచి కొనుగోలు చేయడం ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Written By: Srinivas, Updated On : January 18, 2024 5:42 pm
Follow us on

Hyundai car : నేటి కాలంలో తక్కువ బడ్జెట్ లో కారు కొనాలని చూస్తున్నారు. అందుకే పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆఫర్ల కోసం ఎదురుచూస్తారు. కానీ కొన్ని కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు సాధారణ రోజుల్లోనూ డిస్కౌంట్లను ఇస్తుంటాయి. లేటేస్టుగా ఓ కంపెనీ CSD (Canteen Store Department) ద్వారా ఓ కారును విక్రయిస్తోంది. ఈ రకంగా కొనుగోలు చేస్తే రూ.1.24 లక్షల ట్యాక్స్ రిటర్న్ పొందే అవకాశం ఉంది. అసలే ఈ కారు ధర తక్కువగా ఉంది. అందులోనూ ఇంతలా ప్రయోజనం ఉండడంతో ఇంప్రెస్ అవుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకుందామా..

దేశీయ మార్కెట్లో పోటీ పడే కార్ల కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. దీని నుంచి ఇప్పటికే ఆకర్షించే మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో హ్యాచ్ బ్యాక్ వేరియంట్ ఐ20 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని స్పెషిఫికేషన్ చూస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 83 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ సీవీటీ గేర్ బాక్స్ ను కలిగిన ఈ కారులో 1 లీటర్ టర్బో ఇంజిన్ కూడా ఉంది. ఇది 120 పీఎస్ పవర్ ను, 172 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఐ 20 ఫీచర్స్ విషయానికొస్తే 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఛార్జర్, ఎయిర్ ఫ్యూరిఫై వంటి సౌకర్యాలు ఉన్నాయి. 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్ రూప్ ఆకర్షిస్తుంది. ఇందులో ప్రయాణించే వారి భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులను అమర్చారు. అయితే ప్రయాణికులందరికీ సీట్ బెల్ట్, పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రెస్ చేస్తుంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ మరింత ఆకర్షిస్తుంది.

మార్కెట్లో హ్యుందాయ్ ఐ 20 రూ.7,74,800 లక్షలతో విక్రయిస్తున్నారు. దీనిని సీఎస్ డీలో కొనుగోలు చేస్తే రూ.6,77,361 కే వస్తుంది. అయితే CSD ద్వారా కొనుగోలు చేయడానికి కొన్ని అర్హతలుండాలి. భారతీయ సైనిక, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు.. వారి కుటుంబ సభ్యులు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొనుగోలు చేస్తే ఐ 20 నుంచి రూ.97,439 సేఫ్ అవుతుంది. అలాగే టాప్ వేరియంట్ ధర రూ.9,33,800లో అమ్ముతున్నారు. దీనిని సీఎస్ డీలో కొనుగోలు చేస్తే రూ.8,28,755కు తీసుకోవచ్చు. అంటే రూ.1,24,405 వరకు లాభం చేకూరుతుంది. ఐ 20 మొత్తం 8 వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ను దేశంలోని సైనికుల కోసం అందుబాటులో ఉంచింది. అయితే కొనుగోలుదారులు సీఎస్ డీ నుంచి కొనుగోలు చేయడం ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.