The Ghost Trailer: సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ కోసం చిరంజీవి నుంచి నాని వరకూ అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాదాపు 100 సినిమాలు తీస్తే అందులో బ్లాక్ బస్టర్ అయ్యేవి కేవలం 10 మాత్రమే. అందుకే ఫ్లాప్ అయినా కూడా కొత్త ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు నాగార్జున. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ లేని నాగార్జున తాజాగా ‘ఘోస్ట్’ అంటూ వస్తున్నారు. ఇటీవల హిట్ దర్శకులతో కలిసి జోడి కట్టి సినిమాలను పాస్ చేసుకుంటున్నారు.

హీరో రాజశేఖర్ తో ‘గరుడవేగ’ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో నాగార్జున జోడి కట్టి తీసిన సినిమా ‘ఘోస్ట్’. ఈ సినిమాపై బోలెడు అశలు పెట్టుకొని ఈ దసరాకు రిలీజ్ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు బలమున్న యాక్షన్ కథాంశాన్నే నాగార్జున ఎన్నుకున్నారు.
క్లాస్ సినిమాలే కాదు.. ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు తీయగలనని నాగార్జున నిరూపించారు. తాజాగా ‘ఘోస్ట్’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ‘రా ఏజెంట్ ’గా నాగార్జున నటిస్తున్నారు. ట్రైలర్ సీన్లు గూస్ బాంబ్స్ వచ్చేలా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు హైరిచ్ విజువల్స్ తో తీశాడు. తన అక్క , ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో నాగార్జున చేసే సాహసమే ఈ సినిమా అని ‘ట్రైలర్’ను బట్టి అర్థమవుతోంది. సోనాల్ చౌహాన్ నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించింది. ఆమెతో రోమాన్స్, యాక్షన్ కూడా నాగార్జున చేశాడు.
యాక్షన్స్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ‘డబ్బు, సక్సెస్.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది’ అనే డైలాగ్ ను బట్టి ట్రైలర్ లో ఫుల్ ఆఫ్ పగలు ప్రతీకారాలు ఉంటాయని అర్థమవుతోంది.
అక్టోబర్ 5న దసరా సందర్భంగా ‘ఘోస్ట్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ది ఘోస్ట్ ను రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ట్రైలర్