Balakrishna English : ‘నరం లేని నాలుక’ ఏమైనా మాట్లాడుతుందని అంటారు. ఇది బాలయ్య నాలుకకు అక్షరాల సరిపోతుంది. ఆయన ఏజ్ కు ఇమేజ్ కు మాట్లాడే మాటకు అస్సలు సంబంధం ఉండదు.. ఎందుకంటే అందమైన ‘అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపు అయినా చేయాలి’ అంటాడు. వేదిక మీదనే అందరి ముందే ఇలా బరితెగిస్తాడు. ఆప్యాయంగా ఎవడైనా అభిమాని దగ్గరకు వస్తే చెంప చెళ్లుమనిపిస్తాడు. బాలయ్య సినిమాల్లోనే బయటకు కూడా కొంచెం తేడాగా ఉన్నాడే అని చూసిన వారందరూ అంటుంటారు. ఆగ్రహానికి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తుంటాడు.
సినిమాల్లో డైలాగులు బాగానే చెప్పినా.. బయట మాత్రం బాలయ్య బాబు మాట్లాడే భాష చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఆ సాగతీతలు అలా ఉంటాయి మరీ.. ‘ఆ.. ఆ… రోజుల్లో.. మరి.. మా.. నాన్న గారు’ అంటూ బాలయ్య తీసే సాగతీత భాషపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తుంటాయి..
అయితే బాలయ్య బాబు మైక్ అందుకుంటే నాన్న ఎన్టీఆర్ లా పాత కాలపు, పద్యాలు, చరిత్రకు సంబంధించిన తెలుగు గ్రంథిక విషయాలను అనర్గళంగా మాట్లాడేస్తుంటాడు. ఆ పద్యాలు, పదజాలాలు వాడుకలో మాత్రం బాలయ్య సూపరహే అనిపించకమానదు.
ఈ మధ్యన ఇంగ్లీష్ ను కూడా బాలయ్య బాబు ట్రై చేశాడు.. తన మార్క్ ఇష్టానుసారం ఇంగ్లీష్ తో దబిడ దిబిడే అనిపించారు. బాలయ్య బాబు అర్థం కాని ఇంగ్లీష్ లో మాట్లాడిన ఆ మాటలు వైరల్ అయ్యాయి. జనాలు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ ‘మతులు పోగొట్టే బాలంగ్లీష్’ అంటూ ముద్దుగా కామెంట్స్ చేస్తున్నారు.. ‘ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ ఇప్పటికే బాలయ్య ఇంగ్లీష్ డైలాగ్ వైరల్ అయ్యింది. ఇప్పుడు ‘బాలంగ్లీష్’ వీడియో మాత్రం తెగ నవ్వులు పూయిస్తోంది.
— Vikatakavi (@vikatakavi1231) November 6, 2023