Devara Glimpse : దేవర గ్లింప్స్ లో చూపించిన ఆ చందమామ షాట్ లో ఇంత అర్థం ఉందా… కొరటాల నువ్వు సూపరయ్య..

అయితే ఈ గ్లింప్స్ లో దొంగలని పట్టుకోవడానికి ఎన్టీఆర్ వచ్చినట్టు గా మనకు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే...

Written By: NARESH, Updated On : January 8, 2024 7:22 pm
Follow us on

Devara Glimpse : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ షాట్ ని రెండు రోజుల క్రితం రిలీజ్ చేశారు. దానికి బీభత్సమైన క్రేజ్ రావడంతో ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇది ఎలా ఉంది అంటే ఎన్టీయార్ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అనే రేంజ్ లో ఈ గ్లింప్స్ ని అయితే వదిలారు. నిజానికి ఈ సినిమా రెండు పార్టు లుగా రాబోతుంది. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే మొదటి పార్ట్ లోనే ఇండస్ట్రీ రికార్డ్ ని కొట్టబోతున్నట్టు గా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్టీయార్ గ్లింప్స్ తాలూకు కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ సినిమా గ్లింప్స్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక కొరటాల శివ మొదటినుంచి చెప్తున్నట్టుగానే ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక కొరటాల తన స్టామినాను చూపిస్తూ ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాలో విజువల్స్ అయితే ప్లాన్ చేసినట్టు గా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి షాట్ లో కూడా విజువల్స్ టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి. ఇక గ్లింప్స్ రూపంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ ఎంటైర్ సీక్వెన్స్ లో ఎన్టీయార్ మాత్రం రౌద్ర రూపంలో మనకు కనిపించారు. ఇక ఈ సినిమా స్టోరీ కి సంబంధించి ఏమి రివీల్ చేయకుండా జస్ట్ ఆయన్ని ఎలివేట్ చేయడానికి మాత్రమే ఈ గ్లింప్స్ ని వాడుకున్నారు. ఇక ఈ ఫైట్ లోని కొన్ని షాట్స్ మాత్రమే అద్బుతం గా డిజైన్ చేశారు. అలాగే ప్రశాంతం గా బతుకుతున్న ఒక మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆ కోపాన్ని ఒక సముద్రం తో పోల్చి ఒక ఉప్పెన లా చూపించాడు.

ఇక చివర్లో ” ఈ సముద్రం చేపల కంటే కత్తులను నెత్తురునే ఎక్కువగా చూసినట్టుంది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు” అని ఎన్టీయార్ చెప్పే డైలాగ్ ఈ గ్లింప్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది…అయితే ముందుగా ఈ గ్లింప్స్ ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ తో స్టార్ట్ చేసి లాస్ట్ లో చాలా వైలెంట్ గా ఎండ్ చేశారు. ఇక ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో హైలెట్ ఏంటి అంటే ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు బ్లడ్ ఆ పక్కన అర్థ చంద్రాకారం లో ఉన్న చందమామని కలుపుతూ ఆ బ్లడ్ తో కలిసిన పూర్తి చందమామను మనకు చూపించారు. అయితే ఆ షాట్ ఈ గ్లింప్స్ కి హైలైట్ అనే చెప్పాలి.

అయితే ఈ షాట్ ద్వారా డైరెక్టర్ మనకు సింబాలిక్ గా ఒకటి చెప్పాడు. అదేంటంటే “ఇప్పటిదాకా చందమామ లాగా కూల్ గా ఉండే హీరో ని గెలిగితే చాలా వైలెంట్ గా అయిపోతాడు. ఇప్పటిదాకా కూల్ గా ఉన్న వ్యక్తి ని చూశారు ఇప్పుడు రక్తం తో కలిసిన ఆ పూర్తి వ్యక్తిని చూస్తున్నారు” అనేది ఇక్కడ మనకు సింబాలిక్ గా డైరెక్టర్ కన్వే చేశాడు… అయితే ఈ గ్లింప్స్ లో దొంగలని పట్టుకోవడానికి ఎన్టీఆర్ వచ్చినట్టు గా మనకు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…