Thalapathy Vijay: దళపతి విజయ్ టిఎంకె (TMK) పేరుతో కొత్త పార్టీ

ఎక్కువగా యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలను విజయ్ చేస్తున్నాడు. ఆర్గనైజేషన్ పెట్టి సేవలందిస్తున్నారు. దళపతి విజయ్ టిఎంకె (TMK) పేరుతో కొత్త పార్టీ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 31, 2024 1:06 pm

తమిళనాడు రాజకీయాలకు, సినిమాలకు విడదీయలేని సంబంధం ఉంది. 1967లో డీఎంకే అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకూ సినిమాలతో సంబంధం లేకుండా అక్కడ రాజకీయాలు లేవు. జయలలిత చనిపోయిన తర్వాత లేరు కానీ.. మిగతా వాళ్లంతా సినిమా వారే అక్కడ రాజకీయం చేశారు.

డీఎంకే, అన్నాడీఎంకే వాళ్లు ఇప్పుడు సినిమాల్లో లేకున్నా.. వారి పూర్వీకులు సినిమా తారలే. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో కెప్టెన్ విజయకాంత్.. ఒక దఫా అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఎన్టీకే పార్టీ సీమెన్ అనే సినిమా నటుడు కూడా పార్టీ నడుపుతున్నాడు. తమిళ జాతీయవాదం వైపు నడుస్తున్నాడు. ఇక మూడోది కమల్ హాసన్ ‘ఎంఎన్ఎం’ పార్టీ పెట్టి డీఎంకేకు సపోర్టుగా నిలుస్తున్నారు.జనం అందుకే హర్షించలేదు.

ఇక రజినీకాంత్ పార్టీ పెట్టి రాజకీయ ప్రవేశం చేసి ఊరించి మానేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ రంగంలోకి దళపతి విజయ్ ప్రవేశిస్తున్నాడు. రజినీకాంత్ తమిళనాట ఎంత ఐకాన్ గా ఉన్నాడో.. ఆ తర్వాత విజయ్ కు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఎక్కువగా యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలను విజయ్ చేస్తున్నాడు. ఆర్గనైజేషన్ పెట్టి సేవలందిస్తున్నారు.

దళపతి విజయ్ టిఎంకె (TMK) పేరుతో కొత్త పార్టీ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Tags