TVS Apache 2025: భారతదేశంలో 150cc నుంచి 200cc సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో బైక్ కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే, గత నెలలో అంటే మే 2025లో ఈ సెగ్మెంట్‌లో టీవీఎస్ అపాచే టాప్ పొజిషన్ సాధించింది. టీవీఎస్ అపాచే ఈ నెలలో మొత్తం 49,099 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది. ఇక రెండో స్థానంలో బజాజ్ పల్సర్ నిలిచింది. పల్సర్ ఈ నెలలో మొత్తం 38,309 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది.
అమ్మకాల జాబితాలో మూడో స్థానంలో హోండా యూనికార్న్ ఉంది. హోండా యూనికార్న్ ఈ నెలలో మొత్తం 28,616 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఇక నాలుగో స్థానంలో యామాహా ఎఫ్‌జెడ్ నిలిచింది. యామాహా ఎఫ్‌జెడ్ మొత్తం 12,979 యూనిట్లను అమ్మింది. ఐదో స్థానంలో యామాహా ఎమ్‌టి 15 ఉంది. ఇది మొత్తం 7,034 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది.
అమ్మకాల జాబితాలో ఆరో స్థానంలో యామాహా R15 ఉంది. ఇది మొత్తం 5,997 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. దీని అమ్మకాలు 22శాతం పెరిగాయట. ఏడో స్థానంలో హోండా ఎస్‌పి 160 ఉంది. ఇది మొత్తం 3,294 యూనిట్లను అమ్మింది. ఎనిమిదో స్థానంలో హీరో ఎక్స్‌పల్స్ 200 నిలిచింది. ఇది మొత్తం 2,407 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది.
సేల్స్ జాబితాలో తొమ్మిదో స్థానంలో కేటీఎం 200 ఉంది. ఇది మొత్తం 2,071 యూనిట్లను విక్రయించింది. పదో స్థానంలో బజాజ్ అవెంజర్ నిలిచింది. ఇది మొత్తం 1,277 యూనిట్లను అమ్మింది. 11వ స్థానంలో హోండా హార్నెట్ 2.0 ఉంది. ఇది మొత్తం 1,273 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. 12వ స్థానంలో సుజుకి జిక్సర్ ఉంది. ఇది మొత్తం 914 యూనిట్లను విక్రయించింది. పదమూడో స్థానంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160R/200 నిలిచింది. ఇది మొత్తం 623 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది. 14వ స్థానంలో హోండా సిబి200ఎక్స్ ఉంది. ఇది మొత్తం 586 యూనిట్లను విక్రయించింది. ఇక చివరగా 15వ స్థానంలో కావసాకి డబ్ల్యూ 175 నిలిచింది. ఇది కేవలం 57 యూనిట్ల మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది.