Homeఆంధ్రప్రదేశ్‌KCR Jagan : పాపులారిటీలో తెలుగు సీఎంలు అట్టర్‌ ప్లాప్‌.. సర్వేలో అడ్రసే లేని కేసీఆర్‌!

KCR Jagan : పాపులారిటీలో తెలుగు సీఎంలు అట్టర్‌ ప్లాప్‌.. సర్వేలో అడ్రసే లేని కేసీఆర్‌!

KCR Jagan : జాతీయ పార్టీ.. దేశవ్యాప్తంగా పార్టీ విస్తర్ణ.. ప్రధాని పదవి.. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనలన్నీ ఇవే. త్వరలోనే ప్రధాని కాబోతున్నట్లుల సొంత పార్టీ నేతలతో ఊకదంపుడు ప్రచారం. కానీ ఇండియాటుడే ప్రధాని పదవికి తగిన ప్రతిపక్ష నేత అనే ప్రశ్నపై జాతీయ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు(మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌) కేసీయార్‌ పేరు అసలు కనిపించనేలేదు. అదేమంటే..? అసలు తనను ఓ కంటెండర్‌గా భావించి, లిస్టులో పెడితే కదా జనం అభిప్రాయం తెలిసేది. బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో ఇంత హంగామా చేస్తున్నా ఇండియాటుడే కేసీఆర్‌ను అసలు సోదిలో లేకుండా తీసిపారేయడం ఏమిటి..? కేజ్రీవాల్, మమతకన్నా ఏం తక్కువ అంటే.. ఇండియా టుడూ మీడియా సంస్థ ఎడిటోరియల్‌ వింగ్‌ అలా ఫీలైంది మరి. నో.. నో.. ఇండియాటుడే వాళ్లు అప్పుడప్పుడూ నమస్తే తెలంగాణ పత్రికతోపాటు నమస్తేప్రభ, నమస్తే సాక్షి కూడా చదవాలి కదా, లేకపోతే కేసీయార్‌ హల్‌చల్, జోరు వాళ్లకు ఎలా అర్థమవుతాయని ఓ జోక్‌.

పాపులర్‌ సీఎంల జాబితాలోనూ పత్తాలేడు..
నిజంగానే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేను సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు కేసీఆర్‌పై దేశం అభిప్రాయం ఏమిటో సూచనప్రాయంగానైనా అర్థం అవుతుంది. వాళ్లు మోస్ట్‌ పాపులర్‌ సీఎం అనే విభాగంలో సర్వే చేస్తే టాప్‌ టెన్‌లో కూడా కేసీఆర్‌ లేడు. ఇందులో ఫస్ట్‌ ప్లేసు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ది. అక్షరాలా ఆయన అర్హుడు కూడా. ఇక సెకండ్‌ ప్లేస్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈమధ్య తరచూ వార్తల్లో నిలబడుతున్న అస్సోం సీఎం హిమంతబిశ్వశర్మ మూడో ప్లేసు, తరువాత స్థానాల్లో చత్తీస్‌గఢ సీఎం భూపేష్‌ భఘెల్, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ం చివరి టాప్‌ టెన్‌ప్లేసులో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి, జాతీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్లు ఎక్కడా కనిపించలేదు.

జాతీయ స్థాయిలో ఉత్తముడు ఎవరంటే..
పై ఫలితాలన్నీ ఆయా రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా వచ్చినవి. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని జాతీయ స్థాయిలో అందరినీ ప్రశ్నిస్తే డిఫరెంట్‌ రిజల్ట్‌ కనిపించింది. ఫస్ట్‌ ప్లేస్‌లో యోగి, సెకండ్‌ కేజ్రీవాల్‌ నిలిచారు. తరువాత వరుసగా మమతాబెనర్జీ, స్టాలిన్, నవీన్‌ పట్నాయక్, హిమంత బిశ్వశర్మ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, ఏకనాథ్‌షిండే, జగన్‌మోహన్‌రెడ్డి, భూపేష్‌ భఘెల్‌ ఉన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్‌ జాడలేదు. యోగి టాప్‌ వన్‌ పొజిషన్‌లో ఉన్నారు.

రెండు కేటగిరీల్లోనూ తెలుగు సీఎంలు పూర్‌..
ఈ రెండురకాల కేటగిరీల్లోనూ తెలుగు సీఎంలు పూర్‌. మరీ కేసీఆర్‌ జాడ లేదు. జగన్‌ కనీసం టాప్‌టెన్‌ జాబితాలో కనిపిస్తున్నాడు. సో, కేసీఆర్‌ను ప్రధాని కంటెండర్‌ జాబితాలో చేర్చకపోవడంలో ఇండియాటుడే తప్పుటడుగు వేసినట్టు ఏమీ కనిపించడం లేదు. కేసీఆర్‌పై వాళ్లకున్న అంచనా అదీ!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version