https://oktelugu.com/

KCR’s New Secretariat : కేసీఆర్ కొత్త సచివాలయ భద్రతనే అసలు సమస్య

KCR’s new secretariat : పాత సచివాలయాన్ని పడగొట్టి.. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న కెసిఆర్.. దీనిని తెలంగాణ గుండెకాయగా అభివర్ణిస్తున్నారు.. గత పాలకులకు ఇలాంటి సోయి ఉందా అని విమర్శిస్తున్నారు.. సరే కేసీఆర్ విమర్శలను పక్కన పెడితే… ఒకసారి తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది.. […]

Written By:
  • Rocky
  • , Updated On : January 29, 2023 5:32 pm
    Follow us on

    KCR’s new secretariat : పాత సచివాలయాన్ని పడగొట్టి.. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న కెసిఆర్.. దీనిని తెలంగాణ గుండెకాయగా అభివర్ణిస్తున్నారు.. గత పాలకులకు ఇలాంటి సోయి ఉందా అని విమర్శిస్తున్నారు.. సరే కేసీఆర్ విమర్శలను పక్కన పెడితే… ఒకసారి తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది.. ఖమ్మంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవాన్ని ఏ విధంగా అయితే రాజకీయం చేశారో… సచివాలయ ప్రారంభోత్సవాన్ని కూడా రాజకీయం చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విపక్ష పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించినట్టు సమాచారం.. ప్రస్తుతం ఈ సచివాలయానికి సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయి.. ఫిబ్రవరి 17 లోపు పూర్తి చేయాలని అధికారులు రాత్రి పగలు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

    సువిశాలమైన, ఆధునిక హక్కులతో కూడిన నూతన సచివాలయ భవన బాధ్యతను ఎవరికి అప్పగించాలనే అంశంపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది.. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతను పర్యవేక్షిస్తుంది.. ఎస్పీఎఫ్ నాన్ ఆర్మ్ డ్ ఫోర్స్ కావడంతో వారికి బదులు సాయుధులైన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ భద్రత కల్పించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది.. మరికొద్ది రోజుల్లో నూతన సచివాలయ భవనం ప్రారంభం కానుండగా ఇప్పటివరకు స్పష్టత రాలేదు.. టీఎస్ పీఎస్ పీ బలగాలను నియమించేందుకే ప్రభుత్వం ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కొన్ని దశాబ్దాలుగా సచివాలయ భద్రతను ఎస్పీఎఫ్ నిర్వహిస్తోంది.. పాత సచివాలయ భవనానికి సుమారు 250 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండేవారు. టీఎస్ ఎస్పీ సాయుధ బలగాలను నియమించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ యోచన. ఎస్పి స్థాయి అధికారి పర్యవేక్షణలో సుమారు 450 మంది టీఎస్ ఎస్ సీ అధికారులు, సిబ్బంది భద్రతా విధుల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. నూతన సచివాలయ భవనం ప్రారంభానికి మూడు రోజుల ముందు భద్రతా ఏర్పాట్ల అప్పట్లో వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.. సచివాలయం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. సీఎం కార్యాలయం మాత్రమే పూర్తయింది.. దాని వరకే 17న ప్రారంభిస్తారు.. సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో నాలుగు నెలలు పట్టే అవకాశం కని పిస్తున్నది.

    సచివాలయం భవనంలో 24/7 అత్యంత సు శిక్షితులైన సాయుధ బలగాలు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.. 28 ఎకరాల్లో 10.5 లక్షల చదరపు అడుగుల్లో ఆరు అంతస్తులో ఈ భవనం ఉంటుంది. అనుకోని పరిస్థితి ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలను స్పే ర్ గా 24/7 అందుబాటులో ఉంచనున్నారు.. అంతే కాకుండా ఇంటలిజెన్స్ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారు.

    ఇక నూతన సచివాలయం భవనం ఆవరణలో ప్రతి అంగుళం నిఘా నీడలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అందుకోసం ఆధునిక టెక్నాలజీ గల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.. కారిడార్, పార్కింగ్, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, పేషీలు ఇలా అవసరమైన ప్రతిచోటా కెమెరా నిఘా ఉంటుంది.. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం తో అనుసంధానం చేయడం వల్ల వాంటెడ్ వ్యక్తులు, అనుమానితుల కదలికలు ఉంటే భద్రతా సిబ్బంది తక్షణమే గుర్తిస్తారు.