Telangana Elections : సంచలన సర్వే.. తెలంగాణలో ఆ పార్టీదే హవా..!!

అలాగే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధిగా గెలవబోతున్నట్లు సీ నెక్ట్స్' ప్రకటించింది.

Written By: NARESH, Updated On : November 23, 2023 8:29 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లో పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక సర్వే సంస్థలు ఇప్పటికే ప్రీపోల్‌ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయినా.. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు తారుమారవుతున్నాయి. దీంతో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోతుంది, తమ అభిమాన నేతలు గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ సాధారణ ఓటర్లలోనూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ వరుసగా రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుస విజయాలు సాధించింది. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టడం కూడా ఖాయం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయనే చర్చ జరుగుతున్న వేళ సీ నెక్ట్స్ సంస్ధ తాజాగా సంచలన సర్వే ఫలితాలు విడుదల చేసింది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగానే ఈ సర్వే సంస్థ ఫలితాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ హవా..
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఈ నెల 21 వరకూ ఉన్న అంచనాల్ని సీ నెక్ట్స్ సంస్థ సర్వే రూపంలో ఫలితాలు ప్రకటించింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన ఈ సర్వే అంచనాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఏకంగా 91 సీట్లు రాబోతున్నట్లు సీ నెక్స్ట్ సర్వే అంచనా వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు ఈ సర్వే అంచనాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్‌ గాలిలో కొట్టుకుపోనున్న బీఆర్‌ఎస్‌..
కాంగ్రెస్ తర్వాతి స్థానంలో అధికార బీఆర్ఎస్ కేవలం 14 సీట్లకే పరిమితం కాబోతున్నట్లు టీ నెక్స్ట్ సర్వే తేల్చింది. కాంగ్రెస్‌ గాలిలో బీఆర్‌ఎస్‌ 65 నుంచి 70 సీట్లు గల్లంతవుతాయని ప్రకటించింది. ఇక అధికారంలోకి వస్తామని, బీసీని సీఎం చేస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రటించిన బీజేపీకి 5 సీట్లు రాబోతున్నాయని తేల్చింది. బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా కేవలం 4 సీట్లకే పరిమితం కాబోతుందని ఈ సర్వే చెబుతోంది. బీఎస్పీ ఒక సీటు గెలుస్తుందని పేర్కొంది.

ఐదు స్థానాల్లో హోరాహోరీ..
తెలంగాణలో మరో ఐదు సీట్లలో గట్టి పోటీ నెలకొందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. గట్టి పోటీ నెలకొన్న ఐదు సీట్లలో కరీంనగర్, సిరిసిల్ల, నర్సాపూర్, చేవెళ్ల, మలక్‌పేట్ ఉన్నాయి. కరీంనగర్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య, సిరిసిల్లలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య, నర్సాపూర్ లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య, చేవెళ్లలోనూ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య, మలక్‌పేట్‌లో ఎంఐఎం-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది.

సంచలనాలు నమోదు..
సీ నెక్ట్‌‍్స సర్వే వచ్చే ఎన్నికల్లో సంచలనాలు కూడా నమోదవుతాయని తేల్చింది.సీఎం కేసీఆర్ తాను పోటీ చేస్తున్న రెండు సీట్లలోనూ ఓడిపోతారని సీ నెక్ట్స్ సర్వే తేల్చింది. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ చేతిలో, కామారెడ్డితో రేవంత్‌రెడ్డి చేతిలో సీఎం ఓడిపోతారని ప్రకటించింది. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తున్న రెండు స్ధానాల్లోనూ గెలుస్తారని సర్వే తేల్చింది. అలాగే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధిగా గెలవబోతున్నట్లు సీ నెక్ట్స్’ ప్రకటించింది.