Homeజాతీయ వార్తలుTelangana BJP: అతడే బీజేపీ సీఎం క్యాండిడేట్.. తెలంగాణ బీజేపీలో మళ్లీ హీట్

Telangana BJP: అతడే బీజేపీ సీఎం క్యాండిడేట్.. తెలంగాణ బీజేపీలో మళ్లీ హీట్

Telangana BJP: రెండు సార్లు అధికారం పంచుకున్న కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనంటున్నారు. ఇక దూసుకొస్తున్న బీజేపీని అదుపు చేయడం కేసీఆర్ కు కానకష్టం అవుతోంది. పాదయాత్రతో కదులుతున్న ‘బండి’పాదానికి బీజేపీకి ఊపు వస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ దండు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టారు. ఈనెల 14వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రతో కమళదలంలో కదనోత్సాహం కనిపిస్తోంది. హిందుత్వ నినాదం, ప్రజా సమస్యలే లక్ష్యంగా బండి సజయ్‌ ప్రభుత్వపై యాత్రలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్‌ యాత్రకు ప్రజాదరణ లేదంటూనే యాత్రపై విమర్శలు చేయడం.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వరుసగా బండికి బహిరంగ లేఖలు రాయడం ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనను తెలియజేస్తోంది. ఈ క్రమంలో బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈమేరకు కొంతమంది నేతలు ప్రచారం చేసుకుంటుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Telangana BJP
Telangana BJP

-ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో ప్రజల్లోకి..
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం తమవిగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులను బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ప్రజలకు సభల ద్వారా వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి.. గడీల పాలన నుంచి విముక్తి కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు వివరిస్తున్నారు. ‘కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లా వేదికగానే తెలంగాణ ఉద్యమం సాగించాడు. రాష్ట్రం వచ్చిన వెంటనే కృష్ణా నది నీళ్లు తెచ్చి ఆ ప్రాంత రైతుల కాళ్లు కడుగుతా అన్నాడు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధించి జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నాడు.. వలసలు ఆపుతానన్నాడు.. కానీ ఈ హామీల్లో ఒక్కటైనా నేరవేర్చాడా?’ అని నిలదీస్తున్నాడు.

Also Read: KA Paul: కేఏ పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఆయనకు పుషింగ్ ఇచ్చే వారెవరు?

బండి సంజయ్‌ యాత్రకు పాలమూరు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో పార్టీ క్యాడర్‌లో జోష్‌ కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు తమ కన్నీళ్ల గాథలను బీజేపీ అధ్యక్షుడికి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న భావన ప్రజల్లో వచ్చిందని, అందుకే వేలాది మంది ప్రజలు స్వచ్చందంగా తన పాదయాత్రలో పాల్గొంటున్నారని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు.

Telangana BJP
Telangana BJP

-అధిష్టానం చెప్పిన వ్యక్తే…
తెలంగాణలో పార్టీ బలపడుతున్న వేళ.. బీజేపీలో నేతల మధ్య భేదాభిప్రాయలు బయట పడుతున్నాయి. అధికారంలోకి వస్తామని నమ్మకం కలుగుతుండడంతో.. పార్టీలో తానంటే తాను కీలకం అన్నట్లు కొంతమంది ప్రచారం చేయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో బలంగా ఉన్న బీజేపీ అదే అస్త్రంతో తమ స్థాయిని పెంచి ప్రచారం చేయించుకుంటున్నారు. సీఎం అభ్యర్థిపై కూడా చర్చ జరుపుతున్నారు. గ్రూపులు కూడా కడుతున్నారు. అయితే బండి సంజయ్ పార్టీలో గొడవలు లేవని.. ఎవరికి అప్పగించినా పని వారు సమర్థంగా నిర్వర్తిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నచిన్న అలకలు, సమస్యలు ఏ పార్టీలోనైనా సహజమేనని.. వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అధిస్ఠానమే నిర్ణయిస్తుందని బండి సంజయ్‌ సంచలన ప్రకటన చేశారు. అధిష్ఠానం ఎవరిని సీఎం అభ్యర్థిగా నిర్ణయించినా శిరసావహిస్తామన్నారు. ‘తానే సీఎం అభ్యర్థిని అనుకుంటే ఒక్కోసారి పోటీ చేసేందుకు టిక్కెట్‌ కూడా రాకపోవచ్చన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ బీజేపీ జెండా కింద పనిచేయాల్సిందేనని.. పదవులు వాటి అంతటే అవే వస్తాయి.. లక్ష్మణరేఖ దాటిన వారిని అధిష్ఠానమే చూసుకుంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.

-బండి సీఎం కావాలి..
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఇటీవల మక్తల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్‌ కూర్చున్న సీటులో బండి సంజయ్‌ కూర్చుంటేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయని సంచలన కామెంట్స్ చేశారు. బండి సంజయే సీఎం అభ్యర్థి అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కాషాయ శిబిరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను సీఎం అభ్యర్థిని కాదని ఓ వైపు సంజయ్‌ చెబుతుంటే.. ఆయనే సీఎం క్యాండిటేట్‌ అన్నట్లు జితేందర్‌ ఎలా కామెంట్‌ చేస్తారని పార్టీలో చర్చ మొదలైంది. దీంతో జితేందర్‌ రెడ్డి వ్యాఖ్యలు మిస్‌ ఫైర్‌ కాకుండా రంగంలోకి దిగిన బండి సంజయ్‌… తాను సీఎం అభ్యర్థిని కాదని, అధిష్ఠానం ఎవరిని నియమించినా తాము అంగీకరిస్తామని క్లారిటీ ఇచ్చారు.

-తెలంగాణ బీజేపీ సీఎం క్యాండిడేట్ రేసులో ఎవరెవరు?
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో సీఎం క్యాండిడేట్ రేసులో ప్రధానంగా ఇద్దరు ఉన్నారు. అందులో తొలి స్థానంలో బండి సంజయ్ ఉంటారు. ఇక రెండోప్లేసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉంటారు. అధిష్టానం ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తే ముందుగా కిషన్ రెడ్డిని ఆలోచించే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర బీజేపీని నడిపించిన బండి సంజయ్ కు సైతం సీఎం రేసులో అవకాశాలు బాగానే ఉంటాయి. ఒకవేళ వీరిద్దరూ కాకుండా యూపీ ఫార్ములాను ఆలోచిస్తే మంత్రిగా అపార అనుభవం.. ఉద్యమ నేపథ్యం ఉన్న ఈటల రాజేందర్ కు సీఎంగా అవకాశం ఇవ్వొచ్చు. ఈ ముగ్గురిలో ఒకరికి సీఎంగా ఛాన్స్ రావడం ఖాయం. ఎవరన్నది వేచిచూడాలి.

Also Read:CM KCR- CS Somesh Kumars: సీఎస్ సోమేష్ కు కేసీఆర్ మంగళం పాడుతున్నారా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular