SA vs INDIA : టీమిండియా కు భారీ షాక్…

వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడి టెస్టు మ్యాచ్ ని ఎలాగైనా గెలిపిస్తారని అనుకున్న క్రమంలో ముగ్గురు కూడా ఫెయిల్ అవ్వడంతో ఇండియన్ టీమ్ భారీ ఇబ్బందుల్లో పడింది...

Written By: NARESH, Updated On : December 26, 2023 9:23 pm
Follow us on

SA vs INDIA : ఇండియా సౌత్ ఆఫ్రికా తో ఆడే రెండు టెస్ట్ ల సీరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఈరోజు ప్రారంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీమ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఇక దీంతో ఇండియన్ టీం మొదట బ్యాటింగ్ కి వచ్చింది. ఇక అందులో భాగంగానే మన టీమ్ ఓపెనర్ ప్లేయర్లు అయిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా చాలా తక్కువ స్కోర్లకే వెను తిరగడంతో ఇండియన్ టీమ్ మొదట్లోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా టీమ్ ని చక్కబెట్టి పనిలో పడ్డారు.

ఇక అందులో భాగంగానే వీళ్ళిద్దరూ చాలా స్లోగా ఆడుతూ సౌతాఫ్రికన్ బౌలర్ల ను ముప్పు తిప్పులు పెట్టారు. అయినప్పటికీ లంచ్ బ్రేక్ తర్వాత అనూహ్యంగా సౌతాఫ్రికా పేస్ బౌలర్ అయిన రబడ విజృంభించడంతో ఇండియన్ టీం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. 121 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఇప్పుడు టీం ని ఆదుకునే నాధుడు లేకపోవడంతో ఇండియన్ టీం నెక్స్ట్ ఏ స్టెప్పు వేస్తుందా అనే ఆసక్తి తోనే ఇండియన్ టీమ్ అభిమానులందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇండియన్ టీమ్ డబ్ల్యూటీసి లో ఫైనల్ కి వెళ్ళాలి అంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్ లో మనవాళ్ళు తప్పకుండా గెలవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇప్పటికే రబాడ 5 వికెట్లు తీసి ఇండియన్ టీం పైన తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీమ్  208 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ కొద్దిసేపు బాగానే ఆడిన కూడా తొందరగానే ఔట్ అయ్యాడు ఇక కెఎల్ రాహుల్ 70 పరుగుల  స్కోర్ చేసి తొలిరోజు నాటౌట్ గా నిలిచి చక్కదిద్దే పని లో ఉన్నాడు. ఇక రాహుల్ తో పాటు గా సిరజ్ కూడా క్రీజ్ లో ఉండి తమ దైన రీతిలో స్కోర్ ని చక్క దిద్దే పనిలో ఉన్నారు. ఇక ఇందులో ఏ ఒక్కరి వికెట్ పోయినా కూడా ఇండియన్ టీం భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే వీళ్ళిద్దరిపైనే భారం వేసి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఇక ఓపెనర్ అయిన రోహిత్ శర్మ 5 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 38 పరుగులు చేశాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడి టెస్టు మ్యాచ్ ని ఎలాగైనా గెలిపిస్తారని అనుకున్న క్రమంలో ముగ్గురు కూడా ఫెయిల్ అవ్వడంతో ఇండియన్ టీమ్ భారీ ఇబ్బందుల్లో పడింది…