Tata Nano EV : రూ.2.20 లక్షలకే 375 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే.. ఈ టాటా కారు బుకింగ్స్ ఓపెన్.. త్వరపడండి..

సరికొత్త టాటా నానో ఈవీ 72 కిలో వాట్ల బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 375 కిలోమీటర్ల మైలేజిని ఇచ్చే విధంగా సెట్ చేశారు.

Written By: Chai Muchhata, Updated On : September 20, 2023 2:39 pm

Tata Nano EV car

Follow us on

Tata Nano EV : దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో టాటా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లో కారు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ వెహికల్స్ ను అందుబాటులోకి తెస్తూ కార్లు ప్రియులను టాటా కంపెనీ ఆకర్షిస్తోంది. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ)దే హవా సాగుతోంది. ఇప్పటికే మారుతి సుజుకీ తదితర కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ తరుణంలో టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రికల్ వాహనాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు బాహుబలిగా దృఢంగా ఉంది. టాటా నానో పేరుతో వస్తున్న ఇది ఆకట్టుకునే డిజైన్ ను కలిగి ఉంది. అలాగే అప్డేట్ వెర్షన్ లో వస్తున్నట్లు టాటా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కారు వివరాల్లోకి వెళితే..

దేశంలోని ఆటోమోబైల్ రంగంలో సంచలనం సృష్టించింది టాటా కంపెనీ. కేవలం లక్ష రూపాయలతో 2008లో నానో కారును అందుబాటులోకి తెచ్చి ఆకట్టుకుంది. చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ నానో ను కొనుగోలు చేశారు. అయితే మిగతా కార్లతో పోటీ పడకపోవడంతో ఆశించినంతా సక్సెస్ కాలేదు. అంతేకాకుండా సేప్టీ రెగ్యులేషన్స్ కారణంగా దీని ఉత్పత్తిని నిలిపివేశారు. ఇప్పుడు ఇది కొత్త రూపాంతరం చెందింది. లేటేస్టుగా ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ వైపుగా దీనిని తయారు చేశారు.

బెంగుళూరులోని మొబలిటీ సర్వీస్ సైనిక్ పాండ్ సిటీ అండ్ గో ఆల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సర్వీస్ మదర్ పాడ్ ఇన్నో వేషన్స్ ప్రైవేట్ లిమిటేడ్ దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. సరికొత్త టాటా నానో ఈవీ 72 కిలో వాట్ల బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 375 కిలోమీటర్ల మైలేజిని ఇచ్చే విధంగా సెట్ చేశారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా, బలమైన పోటీ ఇవ్వడానికి టాటా నానోను తయారు చేశారు.

ఆన్ లైన్లో ఈ వెహికిల్ కు సంబంధించి ప్రాథమిక ఫీచర్స్ గురించి తెలిపారు. ఇందులో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ ను అమర్చారు. భద్రత కోసం ఇందులో ఎక్కువ ఎయిర్ బ్యాగులను సెట్ చేశారు. కన్వీనెంట్ గా ఉండే స్టీరింగ్, లేటేస్టు ఎయిర్ కండీషనర్, పవర్ స్టీరింగ్, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, రేర్ బ్యాక్ కెమెరాతో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఉండనుంది. ఆధునిక కాలానికి చెందిన ఈ కారు కేవలం రూ.2.20 లక్షలకే విక్రయించనున్నారు. ఇప్పటికే కారు బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

https://www.youtube.com/watch?app=desktop&v=vxIrOlICdLM