Samantha – Vijay Devarakonda : అమ్మో సమంత-విజయ్ దేవరకొండ మధ్య ఇంత ఘాటైన సీన్స్ ఉన్నాయా… ఖుషి వీడియో వైరల్

ఆరాధ్య సాంగ్ లో ఓ సన్నివేశం ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. బెడ్ పై సమంత అత్యంత సన్నిహితంగా ఉన్న సన్నివేశాల తాలూకు వీడియో అది. సదరు వీడియో వల్గర్ గా లేకున్నా మోస్ట్ రొమాంటిక్ గా ఉంది. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియో చూసిన కుర్రాళ్ళు థియేటర్స్ కి ఎగబడతారనడంలో సందేహం లేదు.

Written By: NARESH, Updated On : July 19, 2023 8:32 pm
Follow us on

Samantha – Vijay Devarakonda : విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అని చెప్పొచ్చు. మనోడు అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ట్ చేసిన సీరియల్ కిస్సింగ్స్ లైగర్ వరకు కొనసాగించాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో హీరోయిన్ రష్మిక మందాన పెదాలు జుర్రేశాడు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రాశి ఖన్నాతో బెడ్ రూమ్ సన్నివేశాల్లో శృతి మించి నటించాడు. లేటెస్ట్ రిలీజ్ లైగర్ మూవీలో అనన్య పాండేతో రొమాన్స్ ఓ రేంజ్ లో చేశాడు. ఇక సమంత విషయంలో కూడా విజయ్ దేవరకొండ తగ్గలేదని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ నేడు షేర్ చేసిన వీడియో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది.

ఆరాధ్య సాంగ్ లో ఓ సన్నివేశం ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. బెడ్ పై సమంత అత్యంత సన్నిహితంగా ఉన్న సన్నివేశాల తాలూకు వీడియో అది. సదరు వీడియో వల్గర్ గా లేకున్నా మోస్ట్ రొమాంటిక్ గా ఉంది. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియో చూసిన కుర్రాళ్ళు థియేటర్స్ కి ఎగబడతారనడంలో సందేహం లేదు. అంతగా మనసులను తాకింది. చాలా గ్యాప్ తర్వాత సమంత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది.

మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఖుషి చిత్రం మైత్రీ మూవీస్ బ్యానర్లో నిర్మించారు. ఇక విజయ్ దేవరకొండతో సమంతకు ఇది రెండో చిత్రం. గతంలో మహానటి మూవీలో విజయ్, సమంత జంటగా నటించారు. ఖుషి చిత్ర సాంగ్స్, ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరోవైపు విజయ్ దేవరకొండకు గీత గోవిందం తర్వాత హిట్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వరుసగా పరాజయం పొందాయి. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న జనగణమన మధ్యలో ఆగిపోయింది. ఆఫర్స్ వస్తున్న విజయాలు దక్కడం లేదు. మరి ఖుషి విజయ్ దేవరకొండ దాహం తీరుస్తుందేమో చూడాలి. ఇటీవల దర్శకుడు పరుశురామ్ తో కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.