https://oktelugu.com/

ఎస్బీఐ నుంచి 14 లక్షల లోన్.. ఏడేళ్లలో తిరిగి చెల్లించే ఛాన్స్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెన్షన్ రుణాలను అందిస్తూ రుణాలను తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. కస్టమర్ల అర్హత ప్రాతిపదికన రుణాలను మంజూరు చేస్తున్న ఎస్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, డిఫెన్స్, ఫ్యామిలీ పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. 25 వేల రూపాయల నుంచి 14 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇతర లోన్లతో పోలిస్తే ఎస్బీఐ పెన్షన్ లోన్లకు ఎక్కువ వడ్డీని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 14, 2021 2:56 pm
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెన్షన్ రుణాలను అందిస్తూ రుణాలను తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. కస్టమర్ల అర్హత ప్రాతిపదికన రుణాలను మంజూరు చేస్తున్న ఎస్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, డిఫెన్స్, ఫ్యామిలీ పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. 25 వేల రూపాయల నుంచి 14 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది.

    అయితే ఇతర లోన్లతో పోలిస్తే ఎస్బీఐ పెన్షన్ లోన్లకు ఎక్కువ వడ్డీని తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ లోన్లపై ఎస్బీఐ ఏకంగా 9.75 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. తక్కువ డాక్యుమెంటేషన్, ఈజీ ఈఎంఐ, అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, త్వరితగతి మంజూరు, నో హిడెన్ ఛార్జీలు లాంటి బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. 1800 11 2211 లేదా 7208933145 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    లోన్ తీసుకునే వారి వయస్సు, పెన్షన్ ప్రాతిపదికన పొందే రుణం మొత్తంలో మార్పులు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు ఏకంగా 7.5 లక్షల రూపాయల నుంచి 14 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. లోన్ తీసుకున్న రోజు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు 5 సంవత్సరాల్లో లోన్ ను చెల్లించాలి. డిఫెన్స్ పెన్షనర్లు ఏడు సంవత్సరాల్లోగా డబ్బులను తిరిగి చెల్లించవచ్చు.

    ఫ్యామిలీ పెన్షనర్లకు మాత్రం ఇతరులతో పోలిస్తే తక్కువ మొత్తానికే లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పెన్షనర్లు లోన్ తీసుకున్న రోజు నుంచి 5 సంవత్సరాల్లో లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.