Aishwarya: సినీ రంగంలో ఈ మధ్య చాలా మంది నటీ నటులు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్స్ సైతం విడిపోయారు. తాజాగా టాలీవుడ్ కు చెందిన నాగచైతన్య – సమంత విడిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ కథనాయక ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోందని తెలుస్తోంది. భర్త అభిషేక్ బచ్చన్ నుంచి ఐశ్వర్య డైవర్స్ తీసుకుంటారంటూ గత కొంతకాలంగా అనేక కథనాలు వెల్లడి అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు ఇప్పుడు నిజం అయ్యేలా కన్పిస్తున్నాయంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యరాయ్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారంట. దీంతో ఐశ్వర్యరాయ్ – అభిషేక్ తో విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే అమితాబ్ తన కోడలను అన్ ఫాలో చేశారంటూ నెటిజన్లు విస్తృతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. పలువురు సెలబ్రిటీలు విడిపోయే ముందు ఇలా సామాజిక మాధ్యమాల్లో పరస్పరం అన్ ఫాలో చేసుకుంటారని, ఈ తరహాలోనే ఐశ్వర్యరాయ్ విషయంలో కూడా జరుగుతుందేమోనంటూ నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
2007వ సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ వివాహం జరగగా వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉందన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా అమితాబ్ అన్ ఫాలో చేయడంతోనే ఈ వార్త చక్కర్లు కొడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనిపై ఐశ్వర్యరాయ్ కానీ, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ విడాకుల వ్యవహారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Star heroine aishwarya rai is ready for divorce
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com