Red Sandalwood: పుష్ప సినిమాలో శేషాచలం కొండల్లో దొరికే ఎర్రచందనాన్ని అక్రమంగా అల్లు అర్జున్ నరికిస్తాడు. ఆ దుంగలను మొదట్లో మంగళం సీనుకు అమ్ముతాడు. ఆ తర్వాత మురుగన్ దాకా వస్తాడు. మంగళం శీను టన్నుకు 50 లక్షలు ఇస్తే.. మురుగన్ శీను ఏకంగా కోటిన్నరకు అమ్ముతానని చెబుతాడు.. కానీ వాస్తవ పరిస్థితి ఎలా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనాన్ని వేలానికి పడితే టన్నుకు 50 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమార్కుల నుంచి ఎర్రచందనాన్ని పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం ప్రాంతం వద్ద నిర్మించిన గోదాంలో భద్రపరిచారు. 40 సంవత్సరాల పాటు పెరిగిన చెట్టు నుంచి అక్రమార్కులు తీసిన ఎర్రచందనాన్ని పోలీసులు, అధికారులు పలుమార్లు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎర్రచందనాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తారు.. 40 సంవత్సరాలపాటు పెరిగిన చెట్టు నుంచి తీసిన ఎర్రచందనాన్ని మొదటి రకమని, అంతకంటే తక్కువ కాలం పెరిగిన చెట్ల నుంచి తీసిన ఎర్రచందనాన్ని రెండవ రకం అని, దుంగల ఆకారాన్ని బట్టి మూడో రకంగా నిర్ణయిస్తారు. అయితే ఈ మూడో రకంలో దాదాపు 8% వరకు వేలంలో అమ్ముడుపోలేదు. అయితే గత పది సంవత్సరాలుగా అధికారులు వేలానికి పెట్టినప్పుడు మూడో రకమే విక్రయానికి గురి కాలేదు.. ఇక అటవీశాఖ అధికారుల సమాచారం మేరకు తిమ్మినాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన గోదాంలో 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది.. దీన్ని విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంది. ఎర్రచందనాన్ని వేలం వేయడానికి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. గత ఏడాది ఎర్రచందనాన్ని వేలం వేయడానికి ప్రయత్నించినప్పటికీ కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ప్రపంచ మార్కెట్లో ఎర్రచందనానికి డిమాండ్ తగ్గిపోవడమేనని తెలిసింది. ఇక గత ఏడాది మూడుసార్లు ఎర్రచందనం విక్రయించడానికి ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. అయితే ప్రభుత్వ నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాలేదు.
చైనా వ్యాపారులే అధికం
ఏపీలో ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు కొనుగోలు చేసేందుకు చైనా వ్యాపారులు ముందుకు వస్తారు. చైనాకు చెందిన పదిహేను మంది వ్యాపారులు ఎక్కువగా మన ఎర్రచందనాన్ని కొంటుంటారు. అయితే అటవీ శాఖ తన ధర 70 లక్షల నిర్ణయించగా.. ఎక్కువమంది వ్యాపారులు 50 లక్షల కుమించి బిడ్లు వేయలేమని చెప్పేశారు. ముగ్గురు వ్యాపారాలు మాత్రం టెండర్ ధరలకు బిడ్ దాఖలు చేశారు. అయితే వారు కొనుగోలు చేసిన సరుకు కేవలం 30% మాత్రమే ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఏపీ ప్రభుత్వం 500 టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసింది.. ఇక ప్రస్తుతం 4,900 టన్నుల ఎర్రచందనం గోదాంలో మిగిలి ఉంది. గత ఏడాది లాట్ ప్రకారం ఏపీ అధికారులు 500 టన్నుల చొప్పున రెండుసార్లు ఆన్ లైన్ లో టెండర్లను పిలిచారు. అయితే వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు కోట్ చేశారు. అయితే ఊహించిన ధర కంటే దగ్గర్లో ఉన్న రేటుకే ప్రభుత్వం బిడ్ ఓకే చేసింది. ఇక మిగతా లాట్ ల వేలాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. 2016-19 సంవత్సరాల మధ్య ఎర్రచందనం టన్నుకు 75 లక్షల వరకు వ్యాపారులు చెల్లించారు. నాటి దరకే నేడు అధికారులు బిడ్ నిర్ణయించగా కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. జపాన్, మలేషియా, అరబ్, చైనా, సింగపూర్ దేశాలలో ఆర్థిక సంక్షోభం ఉండడం వల్ల కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేశాలలో అత్యంత విలాసవంతమైన భవనాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఎర్రచందనం ద్వారా ఫర్నిచర్ తయారుచేసుకొని తమ హోదా