Karnataka Pre-Poll Survey : శ్రీ ఆత్మసాక్షి (SAS) సర్వే విడుదలైంది. కర్ణాటక ఎన్నికలపై ఈ ఆత్మసాక్షి సర్వే 27వ తేదీన విడుదల చేశారు. అంతకుముందు జనవరి 12 న ఫేజ్ 1లో ఒక సర్వే వచ్చింది. ఏప్రిల్ 26వరకూ చేసిన సర్వేను ఫేజ్ 2గా విడుదల చేశారు.
ఇటీవల టీవీ9 సీఓటర్ సర్వే విడుదల చేయగా.. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే కూడా రెండు దగ్గరగా ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ, స్పష్టమైన ఆధిక్యం వస్తుందని తేల్చింది.
కర్ణాటక ఎన్నికల్లో శ్రీఆత్మసాక్షి సర్వేలో కాంగ్రెస్ గెలుస్తుందని తేలింది. 6 ప్రాంతాల వారీ ఓట్లు, సీట్లు ఇచ్చింది.. రాష్ర్ట వ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్ 41.5 శాతం, జేడీ(ఎస్) 16.5 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వస్తాయని తేలింది. సీట్లు కూడా కాంగ్రెస్ కే ఎక్కువ వస్తాయని తేలింది.
ఇక సీట్లు చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు 115-127 సీట్లు, బీజేపీకి 77-88, జేడీ(ఎస్) 29-36 సీట్లు, ితరులకు 03-08 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేటతెల్లమైంది.
కర్ణాటకలో పరిస్థితులు ఎవరిది విజయం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.