Vanjangi Hills: ఏపీలో ఎక్కడుంది వజంగి.. అరకు, ఊటీకంటే ఇది చాలా బెటర్.. ఫుల్ డీటైల్స్ ఇవే

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వంజంగి కొండ ఉంటుంది. వర్షాకాలం నుంచి శీతాకాలం వరకుఅద్భుతంగా ఉంటుంది.స్వచ్ఛమైన గాలి.. నీలి నీలి ఆకాశం.. మూన్ లైట్.. పచ్చని శాలువా చుట్టినట్టు ఉండే కొండలు, కొండల మధ్య సన్నని రహదారులు, ఇలా ఎన్నెన్నో విశాఖ మన్యం సొంతం.

Written By: Dharma, Updated On : December 31, 2023 11:58 am

Vanjangi Hills

Follow us on

Vanjangi Hills: విశాఖ ఏజెన్సీలో వంజంగి కొండ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక మంచి కురుస్తుండడంతో గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగ మంచు పర్యాటకులకు ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ అందాలను వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు క్యూ కడుతుంటారు. తెల్లవారుజామున కురిసే దట్టమైన మంచుకి గిరి శిఖరాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. దీంతో వంజంగి కొండ మేఘాల కొండగా మారింది. దీంతో సూర్యోదయం వేళ అక్కడ ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు.

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వంజంగి కొండ ఉంటుంది. వర్షాకాలం నుంచి శీతాకాలం వరకుఅద్భుతంగా ఉంటుంది.స్వచ్ఛమైన గాలి.. నీలి నీలి ఆకాశం.. మూన్ లైట్.. పచ్చని శాలువా చుట్టినట్టు ఉండే కొండలు, కొండల మధ్య సన్నని రహదారులు, ఇలా ఎన్నెన్నో విశాఖ మన్యం సొంతం. అయితే వంజంగి కొండ సందర్శనకు విశాఖ జిల్లా యంత్రాంగం అనుమతులు నిలిపివేసింది. అక్కడికి వెళ్తున్న పర్యాటకులు.. పర్యావరణాన్ని విఘాతం కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ సామాగ్రిని విసిరి పారేస్తున్నారు. దీంతో అల్లూరి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల9 వరకు పర్యటనలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో పర్యాటకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

వంజంగి కొండకు వెళ్లాలంటే ఘాట్ రోడ్స్ ఉంటాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాగి ప్రయాణిస్తే భారీగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కరి ప్రాణంతో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలు కూడాప్రమాదంలో పడతాయి.అందుకే న్యూ ఇయర్ వేడుకలకుఅనుమతులు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.జనవరి 9 తర్వాత యధావిధిగా వంజంగి కొండల్లో పర్యాటకులు సందర్శించవచ్చు.