South Africa vs Australia : ఆస్ట్రేలియాను ఎలా చిత్తుగా కొట్టాలో చూపించిన సౌతాఫ్రికా

వరల్డ్ కప్ కి ఇంకొక నెల రోజులు ఉండగా సౌత్ ఆఫ్రికా టీం అత్యంత బలమైన ఆస్ట్రేలియా టీం ని చిత్తుగా ఓడించడం సౌత్ ఆఫ్రికా టీంలో చాలా కాన్ఫిడెంట్ ని నింపే విషయం అనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : September 16, 2023 9:09 am
Follow us on

South Africa vs Australia : ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా లో భాగంగా జరిగిన ఫోర్త్ వన్డే లో సౌత్ ఆఫ్రికా తన విశ్వరూపాన్ని చూపించిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లకి ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులను చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్స్ లలో ఓపెనర్ అయిన డికాక్ 45 పరుగులు చేశాడు.ఇక ఈయన తర్వాత ప్లేయర్ అయిన వన్ డేర్ డసెన్ 62 పరుగులు చేశాడు. ఇక మరో ప్లేయర్ అయిన క్లాసేన్ మాత్రం ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ బౌలర్లకి తన విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. కేవలం 83 బంతుల్లో మూడు ఫోర్లు 13 ఫోర్లు,13 సిక్స్ లతో 174 పరుగులు చేశాడు.

ఇక మిల్లర్ కూడా 45 బంతుల్లో ఐదు సిక్స్ లు,ఆరు ఫోర్లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక చివరి తొమ్మిది ఓవర్ లలో మిల్లర్, క్లాసన్ ఇద్దరూ కలిసి 164 పరుగులు సాధించారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లకి సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 416 పరుగులు చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా టీమ్ 400లకు పైగా స్కోర్ ని ఇప్పటివరకు ఆరుసార్లు చేసింది…ఇక ఆస్ట్రేలియా బౌలర్లు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అనే చెప్పాలి.అందులో హజిల్ వుడ్ రెండు వికెట్లు తీయగా, స్తోయినిస్ , నజీర్, ఎల్లిస్ ముగ్గురు తలో వికెట్ తీశారు…

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం కి ఓపెనర్లు ఆశించిన మేరకు రాణించలేదనే చెప్పాలి. డేవిడ్ వార్నర్ 12 పరుగులకు అవుట్ అవ్వగా హెడ్ 17 పరుగులు చేశాక రిటైర్డ్ హాట్ అయ్యాడు… ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ లో క్యారీ 99 పరుగులు చేసి రబడ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.ఇక టీమ్ డేవిడ్ 35 పరుగులు చేశాడు.వీళ్లు తప్ప ఆస్ట్రేలియా టీం లో ప్లేయర్ ఎవ్వరూ కూడా పెద్దగా రాణించలేదు. దాంతో 252 పరుగులు చేసిన ఆస్ట్రేలియా టీం 34 ఓవర్ ఐదవ బాల్ కి ఆల్ అవుట్ అయింది. ఇక 164 పరుగులతో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మీద ఒక భారీ విజయాన్ని దక్కించుకుంది… ఇక సౌత్ ఆఫ్రికన్ బౌలర్లలో లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లు తీయగా,కగిసో రబడా మూడు వికెట్లు తీశాడు. ఇక సెంచరీ తో అదరగొట్టిన క్లాసెస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు…వరల్డ్ కప్ కి ఇంకొక నెల రోజులు ఉండగా సౌత్ ఆఫ్రికా టీం అత్యంత బలమైన ఆస్ట్రేలియా టీం ని చిత్తుగా ఓడించడం సౌత్ ఆఫ్రికా టీంలో చాలా కాన్ఫిడెంట్ ని నింపే విషయం అనే చెప్పాలి…